దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్సు, శిబిరం ఏర్పాటు.



 దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్సు, శిబిరం ఏర్పాటు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

ఒంగోలు దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ అన్నారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్.ఎల్.ఆర్. మంజూరు కోసం శుక్రవారం ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్.ఎల్.ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ ల మంజూరులో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రీవెన్స్ లో పలువురు దివ్యాంగులు తెలిపారని, దీనిపై స్పందించి ప్రత్యేకంగా ఈ శిబిరం ఏర్పాటు చేసామన్నారు. 59 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో రవాణా శాఖ సిబ్బంది ఆన్ లైన్ ద్వారా ఎల్ ఎల్ ఆర్, లైసెన్స్ స్లాట్ లను బుక్ చేయడంజరుగుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త, రవాణాశాఖ అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Add




Post a Comment

Previous Post Next Post