పొలం పిలుస్తుంది కార్యక్రమం.


 పొలం పిలుస్తుంది కార్యక్రమం.

 క్రైమ్ 9 మీడియా.గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జ్. బి అమృతరాజ్.

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని జేబీకే పురం మరియు శెట్టిచెర్ల గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

        ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వారు మాట్లాడుతూ రబీ 2025 సీజన్ లో పప్పు సెనగ విత్తనములు రాయితీపై అందజేయడం జరిగిందని ఇంకనూ ఎవరికైనా రైతులకు అవసరం ఉన్నచోట వారికి సంబంధించిన రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి విత్తనములు పొందవలెనని తెలియజేశారు. ప్రస్తుతం వరిలో ఆకు చుట్టు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని దీని నివారణకు కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ ఒక ఎకరాకు 400 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి షేక్.అబ్దుల్ రఫీక్.వ్యవసాయ విస్తరణ అధికారి ఎన్. ఆది గణేష్ రైతు సేవ కేంద్రం సిబ్బంది ఏ ప్రవీణ్ కుమార్.మరియు గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

Post a Comment

Previous Post Next Post