కంభం మండల స్థాయి చెకుముకి పోటీ పరీక్షలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బోర్డు స్కూల్ నందు జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వ హించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కంభం మండల విద్యాశాఖ అధికారి 1 అబ్దుల్ సత్తార్ ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో మరియు సమాజాభివృద్ధిలో జన విజ్ఞాన వేదిక పాత్ర ఎనలేనిది అని కొనియాడారు. మండల శాఖ గౌరవ అధ్యక్షులు డాక్టర్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ విద్య మరియు వైద్య రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. మండల శాఖ అధ్యక్షులు వరికుంట్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాల నిర్మూలనలో జన విజ్ఞాన వేదిక ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశనుండే సైన్స్ పైమక్కువపెంచుకోవాలన్నారు.
చెకుముకి కన్వీనర్ షేక్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ ఇటువంటి పోటీ పరీక్షలలో విద్యార్థులు పాల్గొనడం ద్వారా తమ ప్రతిభను మెరుగుపరచుకోవచ్చు అన్నారు. అనంతరం జరిగిన మండల స్థాయి పోటీ పరీక్షలలో అన్ని పాఠశాలల నుండి 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో ప్రభుత్వ పాఠశాలల విభాగం నుండి , వి.వి.ఎస్.జిల్లా పరిషత్ హై స్కూల్ (ఫర్ గర్ల్స్ )విద్యార్థినిలు-- హఫ్సాతస్లిమ్, హిమ శ్రీదేవి, ఆల్ఫాజ్ ఖానo మరియు ప్రైవేట్ పాఠశాలల విభాగం నుండి వాసవి విద్యానికేతన్ విద్యార్థులు .. అఖిలారెడ్డి ,రిత్విక్ ,అనన్య ప్రథమ స్థానంలో రాణించారు. అనంతరం ప్రధమ మరియు ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులందరికీ బహుమతులు మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. మండల స్థాయిలో ప్రాధమస్థానం సాధించిన విద్యార్థులు జిల్లా స్థాయి పరీక్షకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో సి .ఆర్ .పి .మురళి ,కోశాధికారి మస్తాన్, ఉపాధ్యక్షులు నాగేంద్రుడు, గఫూర్ ,పార్ధుడు , కార్యదర్శులు అరుణ్ కుమార్ , ఖుర్షిద తమీమ్ మరియు అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
