జిల్లా సమస్యలు పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం మంత్రి ఆనం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్దికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సమగ్రమైన ప్రణాళికలతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి ఆనం.రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా సమీక్ష మండలి సమావేశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి. ఆనం.రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్., పబ్లిక్ హెల్త్, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్, పశు సంవర్ధక శాఖ, మార్కెటింగ్, అటవీ శాఖ, జాతీయ రహదారులు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించి ఆయా కార్యక్రమాల అమలులో నెలకొని వున్న సమస్యల పరిష్కారానికి ఇంచార్జి మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా. డోలా.బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంట్ సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్.పి. రాజాబాబు, జిల్లా ఎస్పి.హర్షవర్ధన్ రాజు, ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, ఎస్.ఎన్. పాడు, శాసన సభ్యులు.దామాచర్ల జనార్ధన రావు, శ్రీ కందుల నారాయణ రెడ్డి, డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, శ్రీ టి. చంద్రశేఖర్, బి.ఎన్ విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్.లంకా దినకర్, ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య, రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి.ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో సహచర మంత్రి డా. డోలా.బాల వీరాంజనేయ స్వామి, జిల్లా శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్ల సమక్షంలో జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పిల సమక్షంలో ఆర్.డబ్ల్యూ.ఎస్., పబ్లిక్ హెల్త్, మున్సిపల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, మైక్రో ఇరిగేషన్, పశు సంవర్ధక శాఖ, మార్కెటింగ్, అటవీ శాఖ, జాతీయ రహదారులు తదితర శాఖలకు సంబంధించి అమలు జరుగుచున్న కార్యక్రమాలు, వాటి పురోగతి, ఈ శాఖలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై కూలంకషంగా చర్చించడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రధానంగా జిల్లాలో త్రాగునీటి సమస్య ఎలా ఉంది, తుఫాన్ కారణంగా అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఏర్పడటం గాని, మంచినీటి సరఫరా పధకాల్లో ఇబ్బందులు కలగడం, హ్యాండ్ బోర్లు మరమ్మత్తులకు గురికావడం వంటి సమస్యలపై ముఖ్యమంత్రి గారి సూచనలు, ఆదేశాలతో వీటన్నిటినీ పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఇంకా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పుర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కొన్ని అంశాలను శాసన సభ్యులు ప్రస్తావించగా, ఆసుపత్రులకు వెళ్లి వాటి పనితీరు, వైద్య సేవల అమల తీరు పరిశీలన చేసి సమగ్రంగా నివేదిక ఇవ్వాలని వైద్యాదికారులను ఆదేశించడం జరిగిందన్నారు. నివేదికలు వచ్చిన తరువాత అవసరమైన మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని సరిచేసేలా చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. ప్రధానంగా ఈ రోజు తుఫాన్ కారణంగా ఈ జిల్లాలో అనేకమైన జాతీయ రహదారులు దెబ్బతినడం జరిగిందన్నారు. వీటి పై సంబంధిత అధికారులతో పూర్తీ స్థాయిలో సమీక్షించడం జరిగిందన్నారు. వాటిని త్వరగా పునరుద్ధరణ చేసేలా అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. అవసరమైతే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులతో చర్చించడం జరుగుతుందని ఇంచార్జి మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఆలయాలు అటవీ శాఖ పరిధిలో ఉండటంతో ఆ ఆలయాల్లో మౌలిక సదుపాయాలు, వాటి అభివృద్ధి కి కొంత ఇబ్బంది పరిస్థితి ఉండేదని, ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి .దృష్టికి తీసుకువెళ్ళి, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. అటవీ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా అటవీ శాఖ పరిధిలో వున్న ఆలయాలు, ఆలయాలకు వెళ్ళే మార్గాలు ఉన్నా వాటిని ప్రభుత్వ నిబంధల మేరకు అభివృద్ధి చేయాలని అటవీ శాఖ అధికారులతో చర్చించి సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. జాతీయ రహదారుల అంశాలు ఎక్కువగా ఈ సమావేశంలో రావడం జరిగిందని, ఈ అంశాలపై మరొకసారి సంబంధిత అధికారులతో సమీక్షించాలని తెలపడం జరిగిందన్నారు. త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటుచేసి వ్యవసాయ, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి వివరాలతో అధికారులను పిలిపించి చర్చించడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లలో ఈ సమీక్షా సమావేశంతో చాలా వరకు అనాదిగా అభివృద్ధికి నోచుకోనటువంటివి అటవీ శాఖల భూముల విషయంలో గాని , జాతీయ రహదారుల భూముల విషయంలో గాని ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకు రావడానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగానికి కొంత వెసులుబాటు కలిగిందని, భవిష్యత్తులో వీటిని సరిదిద్దుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు జిల్లా ప్రజలకు అందించడానికి అధికారుల సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తామని ఇంచార్జి మంత్రి అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా.బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, జిల్లాను అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను, సమస్యలను పరిష్కారించే దిశగా కృషి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్.పి. రాజాబాబు మాట్లాడుతూ, ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా ఎస్పి శ్రీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, జిల్లాలో శాంతి భద్రత కు చేపడుతున్న చర్యలు వివరిస్తూ, జిల్లాలో గంజాను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను తెలపడం జరిగింది.ఒంగోలు పార్లమెంట్ సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. జల జీవన్ మిషన్ కింద జిల్లా కు 2140 కోట్లు నిధులు మంజూరు కావడం జరిగిందని, సంబంధిత పనులు చేపట్టి త్వరగా పూర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపి నిధులతో చేపట్టిన ఆర్వో ప్లాంట్స్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఎపి మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య మాట్లాడుతూ, టంగుటూరు పోలీసు స్టేషన్ భవనం శిధిలావస్థలో వుందని, అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సింగరాయకొండ పోలీసు స్టేషన్ నీట మునగం జరిగిందని, ఈ రెండు పోలీసు స్టేషన్లకు నూతన భవనాలు మంజూరు చేయాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సింగరాయకొండ, టంగుటూరు, సురారెడ్డిపాలెం వద్ద ఆర్ ఓ బి నిర్మాణాలకు చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని తెలిపారు. ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా ఆక్వా రంగం బాగా దెబ్బతిన్నదని, నష్ట పోయిన ఆక్వా రైతులను ఆదుకోవాలన్నారు. అలాగే త్రాగునీటి సరఫరా పధకాలు కూడా దెబ్బతిన్నాయని వీటి పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరారు.
రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ చైర్మన్ డా నూకసాని బాలాజీ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రహదారులను పునరుద్ధరిస్తూ చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ఓఎండి పనులు సక్రమంగా జరగలేదని చాలా పిర్యాదులు వస్తున్నాయని వీటిపై విచారణ జరపాలన్నారు.
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్. లంకా దినకర్. మాట్లాడుతూ, జిల్లాకు జల్ జీవన్ మిషన్ కింద నిధులు ,మంజూరు కావడం జరిగిందని, ఆ నిధుల్లో ఎంత నిధులు ఖర్చు చేసారు, ఎన్ని పనులు పూర్తీ చేసారని కోరడం జరిగింది.
ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, ఒంగోలు నగర ప్రజలకు సురక్షిత త్రాగు నీటి సరఫరాతో పాటు అమృత్ పధకం 2.0 కింద చేపట్టిన పనులు సత్వరం పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. 2014-19 లో గుండ్లకమ్మ నుండి త్రాగునీటి కొరకు పైప్ లైను పనులు చేపట్టడం జరిగిందని, అందులో 85 శాతం పనులు పూర్తీ కావడం జరిగిందని, మిగిలిన 15 శాతం పనులు పూర్తీ చేసేలా అధికారులు దృష్టి సారించాలన్నారు.
గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల.అశోక్ రెడ్డి మాట్లాడుతూ, 2014లో నియోజకవర్గంలో 3 గ్రామ పంచాయతీల్లో ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం త్రాగునీటిని రవాణ చేయడం జరిగిందని, వాటికి సంబందించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు ఇటీవల కురిసిన వర్షాలకు కంభం చెరువు కింద అరటి పంట దెబ్బతినడం జరిగిందని ఆ రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతంలో పంట పొలాలకు అడవి పందుల బెడద వుందని, సబ్సిడీతో సోలార్ పెన్సింగ్ యూనిట్లు మంజూరు చేయాలని కోరారు.
మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా రైతులు నష్టపోవడం జరిగిందని, వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అలాగే రోడ్లు దెబ్బతినడం జరిగిందని, ముఖ్యంగా పొలాలకు వెళ్ళే రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని శాసన సభ్యులు సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. నియోజక వర్గ పరిధిలో చాల అంగన్వాడీ పోస్టులు ఖాళీగా వున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని, అలాగే నియోజక వర్గ పరిధిలో చాల స్కూల్ భవన నిర్మాణాలు ఆగిపోయాయని వాటిని పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ప్రజల త్రాగునీటి అవసరాలకు నీటిని రవాణ చేయడం జరిగిందని, వాటికి సంబందించిన బిల్లులు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే రెవెన్యు సమస్యలు చాల పెండింగ్ లో వున్నాయని, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం వుందని శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఎస్.ఎస్.పాడు శాసన సభ్యులు బి.ఎన్. విజయకుమార్ మాట్లాడుతూ, ఇటీవల తుఫాన్ కారణంగా గుండ్లకమ్మ ర ప్రాజెక్టు నుండి నీటిని వదలడంతో చాలా గ్రామాల్లో రోడ్లు, పంట పొలాలు నీట మునిగాయని, వ్యవసాయ రోడ్డ్లు బాగా దెబ్బ తిన్నాయని, ఈ రోడ్లను పునరుద్ధరించాలని శాసన సభ్యులు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. బ్లాక్ బార్లీ పొగాకు అమ్మకాలు లేక చాలా మంది రైతులు ఇంటివద్దే నిల్వ ఉంచుకోగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తడవడం జరిగిందని, సంబంధిత రైతులను ఆదుకోవాలని కోరారు.
కనిగిరి శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో చేపట్టిన రక్షిత మంచి నీటి పధకాలను త్వరగా పూర్తీ చేయాలని కోరారు. అలాగే కనిగిరి నియోజక వర్గ పరిధిలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణాలు త్వరగా చేపట్టాలని శాసన సభ్యలు, ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. యర్ర గొండపాలెం శాసన సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎర్రగొండపాలెంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూముల కేటాయింపుకు సంబంధిత ఆసుపత్రి వైద్యులు రోజుకు వేయి రూపాయలు తీసుకోవడం జరిగిందని ఇంచార్జి మంత్రి దృష్టి కి తీసుకురావడం జరిగింది. పాలుట్ల కు వెళ్ళే రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ రోడ్డు ను పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందని కోరారు. నియోజక వర్గ పరిధిలో జల జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యు అధికారి శ్రీ చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

