వందేమాతరం గీతం 150వ వసంతోత్సవ వేడుకలోఘంటా పద్మశ్రీ ప్రసాద్.


వందేమాతరం గీతం 150వ వసంతోత్సవ వేడుకలోఘంటా పద్మశ్రీ ప్రసాద్.

ఏలూరు క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శరత్.
 జాతీయ గేయం “వందేమాతరం” రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ గీత ఆలాపన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్  ఘంటా పద్మశ్రీ ప్రసాద్  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “భారతీయ ఆత్మకు ప్రతీకగా నిలిచిన వందేమాతరం గేయం స్వాతంత్ర్య పోరాటంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చింది. దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉంది.” అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ ఎమ్. శ్రీహరి గారు, డిప్యూటీ సీఈఓ కె. భీమేశ్వర్ గారు, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post