స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ ఆంధ్ర భాగంగా మొక్కలు నాటిన మంత్రి ఆనం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం ఒంగోలు పర్యావరణాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖమాత్యులు శ్రీ.ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం
ఒంగోలు నగరంలో ఐదువేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా.బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు.దామచర్ల జనార్ధన రావు, .ముత్తుమల అశోక్ రెడ్డి, బి.ఎన్.విజయ్ కుమార్, పి డి సి సి బ్యాంకు చైర్మన్.కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ. షేక్ రియాజ్, మ్యారీ టైం బోర్డు చైర్మన్. దామచర్ల సత్య, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఒంగోలు ఏఎంసీ చైర్మన్.రాచగర్ల వెంకటరావు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ముందుగా ఒంగోలు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఆచార్య ఎన్జీరంగా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం అంజయ్య రోడ్డులో కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ శ్రీ. హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్.ఆర్. గోపాలకృష్ణలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ' స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర ' కార్యక్రమంలో భాగంగా పచ్చదనానికి, పారిశుధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ఒకేరోజు 5000 మొక్కలను నాటేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. నగరంలోని ఎనిమిది ప్రధాన రహదారుల వెంట పది కాలేజీల విద్యార్థులను భాగస్వాములు చేస్తూ ఈ మొక్కలను నాటిస్తున్నట్లు తెలిపారు. వీటిని జియోట్యాగ్ చేస్తూ పర్యవేక్షణ బాధ్యతలను కూడా వారికే ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం మంగమూరు రోడ్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ వద్ద జనార్ధన రావు, రియాజ్ ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
