క్రైమ్ 9 మీడియా బేస్తవారిపేట రిపోర్టర్.జి నాగయ్య.
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండల కేంద్రంలో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యలను వివరించిన ప్రజలు
ప్రతి ఒక్కరిని కలిసి సమస్యలు విని తక్షణమే పరిష్కరించేలా అధికారులకు ఆదేశించిన
ప్రతి ఒక్క అర్జిని పరిష్కారం అయిన తర్వాత సమాచారం ఇవ్వాలని సూచించిన ఎమ్మెల్యే
ప్రతి ఒక్క అధికారి బాధితుల సమస్యను తీర్చి జవాబుదారితనంతో పని చేయాలన్నారు.
ఎవరికి అలాంటి సమస్య వచ్చినా నేరుగా తమని సంప్రదిస్తే సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట మండల అధ్యక్షుడు సో రెడ్డి మోహన్ రెడ్డి, కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు భూపాల్ రెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి గుంతిక నరసింహ యాదవ్ బెస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు సైదులు, , మరియు కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, తదితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
