సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కెపి రెసిడెన్సి సమీపములో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై మంగళవారం స్థానిక కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మల్లికార్జున ఆధ్వర్యంలో కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. బి. నరసింహారావు వాహన తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన దృష్ట్యా. వాహన సంబంధిత ధ్రువపత్రాలు పరిశీలించడంతో పాటు వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఐ డ్రైవర్లకు వివరించారు. వాహనం నడిపే ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వాహనానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని సి.ఐ. మల్లికార్జున్ వాహన దారులను హెచ్చరించారు.

