ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 108 రైసు మిల్లులో 85 లక్షలు గోనే సంచులు సిద్ధం.


 
ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 108 రైసు మిల్లులో 85 లక్షలు గోనే సంచులు సిద్ధం.

జిల్లాలో 234 రైతుసేవా కేంద్రాలలో రైతులకు అందుబాటులో గోనే సంచులు.

వచ్చేవారం నుండి జిల్లాలో ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ప్రారంభం, అందుకుఅనుగుణంగా ఏర్పాటు పూర్తిచేయాలి.

జిల్లాలో 4 లక్షలు 50 వేలు మెట్రిక్ టన్నులు జిల్లా టార్గెట్ కు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యాలి.

జిపియస్ డివైజ్ సిస్టంతో 3,803 వేలు వాహనాలు సిద్ధం.

జిల్లా ధాన్యం కొనుగోలులో రైసు మిల్లర్స్, లారీ అసోసియేషన్ ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధించుటలో తమ వంతుపాత్ర పోషించాలి.

ధాన్యం కొనుగోలుపై అధికారులతో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ సమీక్ష.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

           ఏలూరు,నవంబరు 03: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ధాన్యం కొనుగోలు పై సంబంధిత అధికారులు, రైసు మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు లారీ అసోసియేషన్ ప్రతినిధులతో రెండు వేర్వేరు సమావేశాల్లో జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ సుదీర్ఘంగా సమీక్షించారు.

              ఈ సందర్భంగా జిల్లా జాయింటు కలెక్టరు యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 108 రైసు మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాలలో 85 లక్షలు గోనే సంచులు సిద్ధం చేశామని, వచ్చేవారం నుండి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, గత అనుభవాలను జోడించి ఏటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 1 లక్ష మెట్రిక్ టన్నులు టార్గెట్ అదనమని, ప్రతి రైతుకు అవగాహన కల్పించి, తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేలా సమిష్టిగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చిన్నచిన్న పొరపాట్లను ముందుగానే సవరించుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి రైతుసేవా కేంద్రంల్లో గోనె సంచులు, టార్పాన్లు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా రైతులు వారి వారి బ్యాంకుల ఖాతాలో జమ అవుతుందని, ఏవరికైనా సమస్యలు, ఆలస్యం అయిన యెడల టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించవచ్చునని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతా పరీక్షలు ఖచ్చితంగా చెయ్యాలని, రైతులకు స్పష్టమైన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వద్దని అన్నారు. జిల్లాలో 108 రైసు మిల్లులో 85 లక్షలు గోనెసంచులలో 60 లక్షలు గోనెసంచులు బాగున్నాయని, మిగతా 25 లక్షల గోనె సంచులు కూడా ఒకటి రెండు సార్లు పరిశీలించుకుని చిన్న చిన్న చిరుగులు ఉంటే కుట్టిసిద్ధం చెయ్యాలని అన్నారు. రైతులకు నాణ్యమైన గోనే సంచులను మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేశారు. బ్యాంకు గ్యారంటీలు సిద్ధం చేసుకోవాలని, అలాగే హమాలీలు, రైతులకు ఏటువంటి ఇబ్బందులు కలగకుండా వెనువెంటనే అన్లోడింగు పూర్తిచేయాలని అన్నారు. ధాన్యం రవాణాలో లారీ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్లు ఏటువంటి ఇబ్బందులు రాకుండా, ధాన్యం కొనుగోలులో తమపాత్రను సమర్థవంతంగా నిర్వహించి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. పిడిఎస్‌ బియ్యం స్మగ్లింగు అరికట్టడం లో రైసు మిల్లర్లు ప్రభుత్వంకు తోడుగా నిలవాలని అన్నారు. గతేడాది అనుభవంతో తేమశాతం కొలిచే యంత్రాలు రైతు సేవా కేంద్రాలలో, రైసుమిల్లులలో ఒకే కంపెనీ తయారుచేసినవి ఉండాలని జిల్లా జాయింటు కలెక్టరు స్పష్టం చేశారు.

        రైసు మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ట్రాన్స్ పోర్టు గురించి లారీ యజమానులతో చర్చించి సకాలంలో రవాణా అయ్యేలా చూడాలని, మా రైసు మిల్లులు తరపున కూడా లారీలు ఇవ్వగలమని తెలిపారు. 2024- 25 రభీపంట కాలంలో జిపియస్ తో ఉన్న టెక్నికల్ ప్రాబ్లం వలన కొన్ని లారీలకు ట్రాన్స్ పోర్టు చార్జీలు చెల్లింపు జరగలేదని వాటికి పేమెంటు అయ్యేలా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు, మా టార్గెట్లు పూర్తిఅయ్యేలా అధికారులు సహకరించాలని కోరారు. లారీ ట్రాన్స్ ప్రతినిధులు గతంలో ఉన్న పెండింగు చెల్లింపులు పూర్తి చెయ్యాలని, ఇప్పుడు జరగనున్న ధాన్యం కొనుగోలుకు ట్రాన్స్ పోర్టుకు చెల్లింపులు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. 

     ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి, సివిల్ సప్లై జిల్లా మేనేజరు పి.శివరామమూర్తి, జిల్లా డియస్ వో ఇ.బి.విలియమ్స్, డిసివో ఆరిమిల్లి శ్రీనివాసు, జిల్లా రైసు మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంటు యన్.వి.యస్.ప్రసాద రావు, కార్యదర్శి పైడిపాటి శ్రీనివాసరావు, జిల్లా ట్రాన్సుపోర్టు అసోసియేషన్ ప్రతినిధులు, రైసు మిల్లర్స్, లారీ ట్రాన్స్ పోర్టు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

Previous Post Next Post