మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో భారత్ 55 పరుగులతో అద్భుత విజయం.
ఇది యావత్ భారత మహిళామణుల విజయం - అభినందనలు తెలిపిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, నవంబర్ 03:- మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికా పై 55 పరుగులతో భారత్ మహిళలు అద్భుతమైన విజయాన్ని సాధించారని, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు గారు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ కోట్లాదిమంది భారత మహిళల ప్రతినిధులుగా మైదానంలో ఆడి భారత దేశానికి మొట్టమొదటి సారిగా మహిళా క్రికెట్ ప్రపంచకప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు విజయం యావత్ భారత దేశ మహిళల విజయమని పేర్కొన్నారు. 1978లో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ తో ప్రారంభమైన భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్థానం, 2025లో ప్రపంచ కప్ సాధించి సగర్వంగా నిలబడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో భారత్ మహిళల జట్టు వీరోచితమైన పోరాటాన్ని ప్రదర్శించింది. ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా జట్టుపై ప్రదర్శించిన నైపుణ్యం భారత మహిళామణుల ఐక్యతను ప్రతిబింబించింది. ఈ విజయానికి కారకులైన క్రీడాకారిణులకు, వారిని తీర్చిదిద్దిన శిక్షకులకు, సహాయకులకు, ఇతర విభాగాలకు చెందిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అభినందనలు తెలిపారు.
