స్వదేశీ వస్తువులను వాడండి - బీజేపీ నాయకులు పిలుపు.


 స్వదేశీ వస్తువులను వాడండి - బీజేపీ నాయకులు పిలుపు. 

గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 మీడియా ఇన్చార్జి బి ఏ రాజ్.

         భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర అధ్యక్షులు,జిల్లా అధ్యక్షులు పిలుపు మేరకు గిద్దలూరు పట్టణ ఆత్మ నిర్భర్ భారత్ కార్య క్రమ ఇంచార్జి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యం లో ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ (మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా) మాయ బజార్ లో డోర్ టు డోర్ కు స్వదేశీ స్టిక్కర్ అంటిస్తూ స్వదేశీ వస్తువుల వాడాలని ప్రజలకు సూచించడం జరిగింది. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె వి నారాయణ పాల్గొనడం జరిగింది. ఈ కార్య క్రమం లో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవ నాసి వెంకట రామాంజనేయులు,మాజీ ఎస్ సి మోర్చ ప్రధాన కార్యదర్శి మట్టే మల్ల పుల్లయ్య,మాజీ మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాధర్ వలి షఫీ,సీనియర్ నాయకులు కె చంద్ర మోహన్,కొప్పుల నర్సింహులు,పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు కొప్పరపు నాగేశ్వర రావు,సీనియర్ నాయకులు శివపురం రవి కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post