ఏలూరు లక్ష్మీ వారపు పేటలో ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు.




  ఏలూరు లక్ష్మీ వారపు పేటలో ఘనంగా ప్రారంభమైన శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు.

ముఖ్య అతిథులుగా హాజరైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి శ్రీమతి మీనా దంపతులు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు.

     ఏలూరు, నవంబర్ 3:- భక్తుల అభీష్టాలను నెరవేర్చే శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో  ప్రజలంతా సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని,  నియోజకవర్గం మరింత అభివృద్ధి పథంలో  పయనించాలని  ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు లక్ష్మీ వారపుపేటలోని శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజుబాబుల జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. జాతరకు ప్రారంభ సూచికగా సోమవారం ముడుపు కట్టే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. శక్తివేషాలు, డప్పువాయిద్యాల నడుమ వైభవోపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఆర్టీసి విజయవాడ జోన్‌ - 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌లు ముఖ్య అతిధులుగా పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి ముడుపును స్వయంగా శిరస్సుపై ధరించి గంగానమ్మ తల్లి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ముడుపు కట్టే ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ  ప్రతి ఏడేళ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా నిర్వహించే గంగానమ్మ జాతర కార్యక్రమం తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.  ఏలూరు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు తగిన శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసి విజయవాడ జోన్‌ - 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌లు మాట్లాడుతూ సంప్రదాయ బద్ధంగా జాతరను అంతా ఒక్కటై నిర్వహించుకోవాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్,  కో - ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు,, లక్ష్మి వారపుపేట  కొలుపుల కమిటీ ధర్మకర్త కనిగొల్ల హేమంత్, కోశాధికారి పోలూరి హరిబాబు, డివిజన్ కార్పొరేటర్ ఇలియాస్ పాషా, పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, జాతర కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post