ఇంటి పన్నులు వసూళ్లులో జరిగిన అవి నీతి అక్రమాలపై సమగ్ర ధర్యాప్తు జరిపించాలి.


 ఇంటి పన్నులు వసూళ్లులో జరిగిన అవి నీతి అక్రమాలపై సమగ్ర ధర్యాప్తు జరిపించాలి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి జిల్లా రిపోర్టర్ (క్రైమ్). 

పి. మహేశ్వరరావు.అనకాపల్లి నవంబర్:03

         దేవరాపల్లి పంచాయితీలో ఇంటి పన్నులు వసూళ్లులో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర మైన దర్యాప్తు జరిపించి అవినీతికి పాల్పుడిన వారిపై.వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న ఎంపిడివో కార్యాలయంలో జరిగిన పిజిఆర్ఎస్ లో పిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు మునగ పాక నుంచి దేవరాపల్లికి బదిలీ పై వచ్చిన బిల్ కలెక్టర్ దేవరాపల్లి గ్రామ ప్రజల కష్టాన్ని అదికార పార్టి నాయకులు అండ దండలతో ఇంటి పన్నులు రూపంలో వసూళ్ళు చేసుకుని ప్రభుత్వానికి చెల్లించ కుండా స్వాహాచేసారని మంఢి పడ్డారు ఇందులో ఇతర సిబ్బంది హస్తం ఉన్నట్లుగా స్పష్టంగా అర్ద మౌతుందని తెలిపారు ఈ విషయమై పత్రికల్లో భహటాంగా వార్తలు వచ్చిన అదికార పార్టి నాయకులు అండ దండలు ఉండడంతో ఈ బాగోతం పై ఎటువంటి విచారణ జరప లేదని తెలిపారు బిల్ కలెక్టర్ రికార్డులు,బీరువా తాళాలను సైతం నేటి వరకు అప్పగించ లేదని అన్నారు వాటిని స్వాధీనం చేసుకు నేందుకు స్థానిక పంచాయతీ ఈవో చేసిన ప్రయత్నాలు ఫలించ లేదన్నారు గత ఎడాది ఇంటి పన్ను సొమ్ము రూ.6 లక్షలే జమ చేసారని దేవరాపల్లి పంచాయతీలో గత ఆర్థిక సంవత్సరం రూ.13 లక్షల మేర ఇంటి పన్ను వసూళ్ళు కావాల్సి ఉండగా గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 25 వ తేదీ వరకు రూ.6 లక్షలు మేర మాత్రమే బ్యాంక్ లో జమ అయ్యాయి మిగిలిన సొమ్ములో ఎంత మేర వసూలు అయ్యిందో సమగ్రమైన దర్యాప్తు జరిపితే తప్ప పూర్తి స్థాయిలో స్పష్టత రాదన్నారు పంచాయతీలో ఇప్పటికే ఇరిగేషన్ భూములకు గ్రామ కంఠాలకు ఇంటి నిర్మాణం అనుమతులు పేరిట పెద్ద ఎత్తున కొందరు అన ధికారికంగా వసూళ్లకు పాల్పుడుతున్నారని తెలిపారు గతంలో కూడా బాత్ రూములు కుంభకోణంలో పంచాయతీ ఇ ఓ సస్పెండ్ అయ్యారని ఇలా ఎంతో మంది అదికార పార్టి నాయకులు చేతుల్లో అదికారులు బలై పోతున్నారనని ఆవేదన వ్యక్తంచేశారు ఈలాంటి పరిస్థితి ల్లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఇంటి పన్నులు వసూళ్లు అవినీతి ఆరోపణలతో పంచాయతీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిందనని దీన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేపడితే అవినీతి అక్రమాలు బైట పడతాయని తెలిపారు విటితో పాటు 2024- 2025 ఆర్దిక సంఘం నిదుల్లో కూడా అవినీతి బట్ట బైలు అవుతుందని అన్నారు దీంతో ఇంటి పన్నులు వసూళ్లు లో జరిగిన.అవినీతి అక్రమాళ్ళు పై అన్ని కోణాల్లో సమగ్ర మైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని పిర్యాదు లో వెంకన్న డిమాండ్ చేశారు.

Post a Comment

Previous Post Next Post