బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు: 10 మద్యం బాటిల్స్ సీజ్ – ఒకరు అరెస్ట్.


 బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు: 10 మద్యం బాటిల్స్ సీజ్ – ఒకరు అరెస్ట్.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా కంభం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అర్ధవీడు మండలం.చెర్లో దొనకొండ గ్రామ బస్ స్టాప్ సమీపములో అక్రమంగా మద్యం సీసాలు కలిగి ఉన్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడులలో సదరు వ్యక్తి వద్ద మొత్తం 10 లిక్కర్ సీసాలు సీజ్ చేయడం జరిగింది, బి. శ్రీనివాసు (చెర్లో దొనకొండ గ్రామం) అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా కంభం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్. కొండారెడ్డి మాట్లాడుతూ—

ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం సీసాలు అమ్మిన,బెల్ట్ షాపులు నిర్వహించిన,అక్రమంగా మద్యం తరలించిన లేదా నిల్వ ఉంచిన,మద్యం విక్రయించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ఎవరైనా సమాచారం ఇచ్చిన వారివివరాలు పూర్తిగాగోప్యంగాఉంచబడతామన్నారు.

ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ ఎస్. కొండారెడ్డి తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ కే.ప్రేమ్ కుమార్ మరియు సిబ్బంది. జి రంగారావు.రంగనాయకులు, శివాజీ, భాష, సంషీరు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post