కంభం లో ఆలపించిన వందేమాతరం గీతం.


 కంభం లో ఆలపించిన వందేమాతరం గీతం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

వందేమాతర గీతానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ సెంటర్ నందు కంభం మండల విద్యాశాఖ అధికారి మరియు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వందేమాతర గీతం ను విద్యార్థులు అధికారులు ఆలపించారు. అనంతరం అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వందేమాతర గీతం భరతజాతి నర నరాల్లో ఉప్పొంగిన ఉద్యమ గీతమే వందేమాతరం అని సామాన్యులను సమరయోధులు గా మలచి స్వాతంత్ర స్ఫూర్తిగా సంకల్ప బలాన్ని అందించిన సాత్విక సాయుధ మే వందేమాతర గీతం అని అన్నారు. కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ వందేమాతరం అని ఆలపించి వందేమాతరం గీత యొక్క విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. కంభం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. బి నరసింహారావు.తాసిల్దార్ వి కిరణ్. ఎంపీడీవో వీరభద్రా చారి. ఎం ఈ ఓ.శ్రీనివాసులు. గవర్నమెంట్ హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం. వీరనారాయణ. ఉపాధ్యాయులు. పోలీస్ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది. వివిధ శాఖల అధికారులు. విద్యార్థిని విద్యార్థులు. ప్రజలు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post