కూటమి పాలనలో అన్నీ వర్గాలకు సంక్షేమం.



 కూటమి పాలనలో అన్నీ వర్గాలకు సంక్షేమం.

క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గం ఇంచార్జి బి అమృతరాజ్.

ముత్తుముల సమక్షంలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా వైసీపీని వీడి 40కుటుంబాలు టీడీపీ చేరిక.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ బిల్లా రమేష్ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికీ టిడిపి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసిపి పాలనలో కార్యకర్తలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి మేలు జరగలేదని, రాష్ట్రంలో అరాచకం, సంక్షోభం తప్ప అభివృద్ధి శూన్యమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని, అందుకు మద్దతుగా నేడు తాము టిడిపిలో చేరుతున్నట్లు స్థానికంగా గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన షేక్ అబ్దుల్లా, ఆషిక్, షేక్ మున్నా, ఖాదర్, రహమతుల్లా, మాలిక్, అల్తాఫ్, నూర్, హుస్సేన్, అమీర్, వినోద్, అశోక్, ఈశ్వర్, సుబ్బారెడ్డి, అంకయ్య, రమారెడ్డీ, ఖలీల్, రసూల్, అబ్దుల్ మరియు టీడీపీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశావలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, కౌన్సిలర్ లోక్కు రమేష్, ప్రధాన కార్యదర్శి పందీటి రజిని బాబు, బద్రి బాషా, మరియు పట్టణ నాయకులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post