అజ్ఞాతం వీడి ..అభివృద్ధిలో భాగస్వామ్యం కండి... పోలీస్ అమరవీరుల సంస్మరణ రణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు .
క్రైమ్ 9 మీడియా, తెలంగాణ ప్రతినిధి.. అక్టోబర్ 21.
వామపక్ష తీవ్రవాద భావజాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జన జీవితంలోకలిసి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా రాష్ట్ర పోలీస్ శాఖ గోషామహల్ లో నిర్వహించిన "పోలీస్ ఫ్లాగ్ డే" కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను సమర్థిస్తూ ఘన నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ కుటుంబాల సభ్యులను పరామర్శించారు. దేశ భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా అన్నారు. విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న సవాళ్లను వారి సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటీవల కాలంలో కొందరికి కీలక మావోయిస్టు నాయకులు లొంగిపోయినా విషయాన్ని ప్రస్తావిస్తూ మిగిలిన మావోయిస్టులు అజ్ఞాతం విడాలని కోరారు.
పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా విధి నిర్వహణలో ఒక్కసారి ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టాల్సి వచ్చిన వెనుకడుగు వేయరు అని నెత్తురు చెందుతున్న మన రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులు ఎందరో ఉన్నారు అని అన్నారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో పోలీస్ అమరులను స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. పోలీసు ఉద్యోగం అంటేనే ప్రతిరోజు ఒక పరీక్ష ప్రతి దినం ఒక పోరాటమే, ఒకవైపు నేరాల అదుపు ట్రాఫిక్ నియంత్రణ గస్తీ బందోబస్తు వంటి సవాలక్ష బాధ్యతలతో విరామం లేకుండా పనిచేస్తూ మనందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను త్యాగం వారే పోలీసులని అన్నారు. పోలీసుల బాధ్యత కోసం ప్రభుత్వం పోలీసుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 16 వేల మంది కానిస్టేబుల్స్ ఎస్సై రిక్రూట్మెంట్ చేశామని అన్నారు.
సంఘ విద్రోహశక్తులు, తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడిన పోలీస్ అధికారులకు సిబ్బందికి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో నష్టపరిహారం అందిస్తున్నామని అన్నారు. విధి నిర్వహణ లో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం వారి పిల్లలకు రెసిడెన్షిఎల్ స్కూళ్లలో ఉచిత విద్యా, వైద్యం బస్సు పాస్ సౌకర్యం అందజేస్తున్నమన్నారు. మెడికల్ సీట్లలో పోలీస్ అమర అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం అని అన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయిన నిజామా బాద్ లో సి.సి.ఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీరమరణం చెందిన విషయాన్ని గుర్తు చేసి ప్రమోద్ కుమార్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ముఖ్యమంత్రి ప్రకటించారు. అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణ వరకు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించారు. వీటితోపాటు పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షలు, ఎక్స్గ్రేషియా పోలీస్ సంక్షేమం నుండి 8 లక్షలు ప్రమోద్ కుటుంబానికి చెల్లించి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు .ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించిందని పాస్ పోర్ట్ వెరిఫికేషన్ విధానంలో విదేశాల నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది అని అన్నారు. తెలంగాణ పోలీస్ సిబ్బందికి అంకితభావానికి నిదర్శనం అని అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ లో అత్యధిక శాతం మహిళా ఐ.పీ.ఎస్ సారధి వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం అని అన్నారు. హైదరాబాద్ పరిధిలో సైబరాబాద్, రాచకొండ కీలక పోలీస్ కమిషనరేట్లో జోనల్ డి.సి.పిలుగా ఏడుగురు మహిళా అధికారులు అని గుర్తు చేశారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రంగారెడ్డి జిల్లాలో మంచి రేవులలో రింగ్ ఇండియా పోలీసులు ప్రారంభించామని అన్నారు. పోలీస్ శాఖ పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని పారదర్శక జవాబుదారితనం నైతిక విలువలు పాటించడం పోలీస్ మూల స్తంభాలు అని ,ఇవి సమాజాన్ని పోలీసులకు దగ్గరికి పాటు పోలీస్ శాఖ పై నమ్మకాన్ని పెంపొందిస్తాయని అన్నారు. సమాజం పట్ల పోలీస్ సింగ్ మోడల్ ను అనుసరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆయా విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
