ఉరితాళ్ళతో ఆదివాసిలు అందోన.


 ఉరితాళ్ళతో ఆదివాసిలు అందోన.

అసంపూర్తిగా నిలిచిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లుకు చేసిన పనులకు బిల్లులు చేల్లించాలని డిమాండ్.

డి వెంకన్న ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.

అనకాపల్లి అక్టోబర్:21

దేవరాపల్లి, వాలాబు పంచాయతీ లో అసంపూర్తిగా నిలిచి పోయిన రోడ్లు, బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు,చేసిన పనులకు వెంటనే బిల్లులు చేల్లించాలని,మంగళవారం వాలాబు పంచాయతీ లోని కోడాపల్లి రామాన్నపాలెం బుచ్చంపాలెం పూలగరువు గ్రామాలకు చేందిన ఆదివాసి గిరిజనులు రామాన్నపాలెం గెడ్డ వద్ద మెడకు ఉరి తాళ్ళు బిగించు కుని వినూత్న రీతిలో పెద్దఎత్తున ఆందోళన చేసారు విరిగి మద్దతుగా వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పల్గోని మాట్లాడారు, ఉప ముఖ్య మంత్రి పంచాయతీ (పంచాయతీ రాజ్ శాఖ మంత్రి) పవన్ కల్యాణ్ దయవల్ల పల్లి పండుగ నిదులతో చేసిన పనులకు సంవత్సరం నుంచి బిల్లులు చేల్లింపులు జరగక చేసిన పనులు అసంపూర్తిగా నిలిచి పోయి గిరిజనులు, కాంట్రాక్టర్లు ఉరితాళ్ళే శరన్యమని బావి స్తున్నారని తెలిపారు,వాలాబు పంచాయ తీలో పూలగ రువు రామాన్న పాలెం బుచ్చం పాలెం బోడ్డగుమ్మి కోనాం కోడాపల్లి బొర్ర చింత తుమ్మలపాలెం గ్రామాలకు సుమారుగా 10 కోట్లు విలువ గల రోడ్లు పనులు చేస్తే కాంట్రాక్టుర్లుకు కేవలం ఒక కోటి డబ్బై లక్షలు రూపాయలు మాత్రమే మంజూరు చేసారని అన్నారు దీంతో దింతో కాంట్రాక్టర్లుకు బిల్లులు రాక ఎక్కడ పనులు అక్కడె అసంపూర్తిగా నిలిపేసారని అగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం కూటమి ప్రభుత్వం యెక్క అసమర్థత వల్లేనని అగ్రహారం వ్యక్తం చేశారు,వీరబద్రిపేటకు 84 లక్షలతో బిటి రోడ్డు మంజూరు అయితే ఎర్త్ వర్క్ చేసి అసం పూర్తిగా రోడ్డు నిలిచి పోయిందని తెలిపారు,నేరెళ్ళపూడి బోడి గరువు మదన గరువు గ్రామాలకు 1,90 కోట్లుతో మంజూరు అయిన రోడ్లు అసంపూర్తిగా నిలిచి పోవడం జరిందన్నారు ఈసంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడంతో గిరిజనులు,ముసలి వారు చిన్న పిల్లలు నిత్యవసర వస్తువులు104,108 వంటి వాహనాలు గ్రామాల్లోకి రాక వైద్యం సక్రమంగా అందక గర్భిని స్త్రీలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్త చేసారు ప్రశ్నించ డానికి పార్టీ పెట్టాను తోక్కినారా తీస్తానని వింత ఉపన్యాసాలు చేప్పిన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ వంటి కీలక శాఖలకు పవన్ కల్యాణ్ మంత్రి అయ్యాక రాష్ట్ర అబి వృద్దిని పూర్తిగా బ్రష్టు పట్టిం చేసారని తెలిపారు పల్లె పండుగ పేరు చేప్పి అట్టహాసంగా పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లు మేడపై కత్తి పెట్టి పునులు చేయించి చేసిన పనులకు బిల్లులు చేల్లించకుండా కాంట్రాక్టర్లు ఉరితాళ్ళు పట్టుకుని తిరిగే పరిస్థితికి ప్రభుత్వ తీసుకు వచ్చిందన్నారు సంవత్సరం కాలం గడుస్తున్నా నిధులు విడుదల కాక కాంట్రాక్టర్లు అసంపూర్తి గానే పనులు నిలిపి వేశారని అన్నారు.అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా రూ,,143 కోట్లు పనులు చేస్తె రూ.11 కోట్లు మాత్రమే విడుదల చేయడం దుర్మార్గమన్నారు జిల్లాలో 166 కిలోమీటర్ల పొడవున 1,354 రోడ్లు పల్లె పండుగలో నిర్మించిన సీసీ రోడ్లు పనులకు ఇప్పటి వరకు బిల్లులు చేల్లించ లేదన్నారు రూ.132 కోట్లు వరకు పెండింగ్లో ఉన్నాయని మండి పడ్డారు ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద 189 కిలోమీటర్ల పొడవు గల 1,734 రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయని ఈపనులు అన్ని పంచాయతీ రాజ్ ఇంజినీర్ల పర్య వేక్షణలో జరిగాయని పేర్కొన్నారు,ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా బిల్లులు మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీ పడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారని తెలిపారు అయినప్పటికీ బిల్లులు రాలేదని వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని వాలాబు చింతలపూడి పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచి పోయిన పనులు పూర్తి చేయాలని చేసిన పనులకు కాంట్రాక్టర్లుకు బిల్లులు చేల్లించాలని వారు డిమాండ్ చేసారు,ఈకార్యక్రమంలో డి శంకర్ రావు ఎరకయ్య కె ఈశ్వరావు కె పైడితల్లి సిహెచ్ లక్షమణ డి,నూకాలు సిహెచ్ చిన దేముడు మామిడిదేముడు ఇ గోపాలుడు బి,నాగేశ్వరరావు కె, రాముడు కె, దేముడు సిహెచ్ రాంబాబుతో పాటు ఆదిక సంఖ్యలో గిరిజనులు మహిళలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post