దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకం.


దేశ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర కీలకం.

తల్లి,తండ్రి, దైవం అన్ని గురువేనని, గురుతర బాధ్యతగా స్వీకరించి నవసమాజం నిర్మాణంకు కృషిచెయ్యాలి.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

నేను గిరిజన వసతి గృహంలో చదువు కున్నవాడినే.

విద్యార్థులకు పాఠాలు చెప్పిన - జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

ఏలూరు/ బుట్టాయిగూడెం, అక్టోబరు 06: బుట్టాయిగూడెం మండలం లంకపాకల/ కోయిదా: గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమీషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ సందర్శించారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించి, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు, విద్యార్థి దశ గోల్డెన్ రోజులని ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని అన్నారు. నేను కూడా గిరిజన వసతి గృహాల్లో చదువు కున్నానని, మాకు అప్పుడు అన్ని సౌకర్యాలు లేవని అన్నారు. కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన, పరిశుభ్రత, టాయిలెట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఈరోజు వండిన ఆహార పదార్థాలను స్వయంగా రుచిచూచి ఎస్సీ కమిషన్ సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల గృహాల్లో ఉండే విద్యార్థులకు ఇంటిని మరిపించేలా సకల సౌకర్యాలు కల్పించి సరస్వతి దేవాలయాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఆశ్రమ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు మంచి ఆరోగ్యం, చదువు పట్ల ఏకాగ్రత కలుగుతుందన్నారు. వైరల్ జ్వరాలు, అంటు రోగాలు వ్యాపించే ప్రస్తుత సీజన్ లో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, వసతి గృహాలు ఆవరణ, పరిసరాలలో ఫాగ్గింగు క్రమం తప్పకుండా చేయించాలని అన్నారు. విద్యార్థులు నిద్రించే ప్రదేశాలలో, కిటికీలకు, దోమతెరలు ఏర్పాటు చెయ్యాలని అన్నారు. వంటచేసే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు వేడి పదార్థాలను పెట్టాలని వారి ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా చూసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యత గల పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో ఉపాధ్యాయులు బోధన చెయ్యాలని, అవసరం అయితే పది సార్లు చెప్పినా అర్ధకాకపోతే పదకొండవ సారి చెప్పి పూర్తిగా చదువుపై పట్టు సాధించేలా ఉతీర్ణతా శాతం పెంచాలన్నారు. విద్యార్థులకు మినరల్ వాటరు సమృద్ధిగా అందించాలని, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్రమం తప్పకుండా విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు ఇవ్వాలని అన్నారు. మరుగుదొడ్లు, స్థానాలు గదులు పూర్తి పరిశుభ్రతతో ఉండాలని, మరమ్మత్తులకు గురైతే వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. వంటగదిలో ఆహార పదార్థాలు తయారీ చేసేటప్పుడు, విద్యార్థులకు ఆహారం పెట్టేదప్పుడు సిబ్బందికి తప్పనిసరిగ్గా చేతికి గ్లోజులు వేసుకోవాలని అన్నారు. విద్యార్థులకు మంచి, చెడులుపై క్లాస్ తీసుకోవాలని, చదువుతో పాటు ఆటలు, పాటలు, సంగీతం, క్రీడలుపై కూడా విద్యార్థులకు నేర్పాలని అన్నారు. ఈ సమావేశంలో ఐటిడిఏ పివో కె.రాములు నాయక్, ఇంచార్చి ఆర్డీవో, యస్సి కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, జిల్లా ఆర్డబ్ల్యూయస్ అధికారి జి.త్రినాధబాబు, విద్యుత్ శాఖ ఇఇ ఫీర్ అహ్మద్ ఖాన్, గృహనిర్మాణ శాఖ ఇఇ కె.వి.వి.యస్.ప్రసాదు, డిప్యూటీ వైద్యఆరోగ్య శాఖ అధికారి డా. సురేష్, మండల వివిధ శాఖల అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్.రాంబాబు, ఉపాధ్యాయులు, ఐటిడిఏ ఉద్యోగులు, ఎస్టీ సంఘాలు ప్రతినిధులు, నాయకులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post