క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
ఏలూరు, అక్టోబర్, 6 : జిల్లాలో 'సూపర్ జీఎస్టీ ... సూపర్ సేవింగ్స్' కార్యక్రమంపై జిల్లాలోని అన్ని గ్రామ సమాఖ్య, గ్రామ/వార్డ్ సచివాలయంలో అవగాహన కార్యక్రమాలు వెంటనే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం 'సూపర్ జీఎస్టీ ... సూపర్ సేవింగ్స్' మొదటి రెండు దశలలో చేపట్టిన కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ఫలాలు సమాజంలోని ప్రతీ కుటుంబానికి తెలిసేలా అవగాహన కలిగించాలని, దీనిపై ముద్రించిన కరపత్రాలను సచివాలయ స్థాయిలో ప్రతీ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ సమాఖ్య, గ్రామ/వార్డ్ సచివాలయాల పరిధిలో జీఎస్టీ తగ్గింపు ద్వారా నెలకు ప్రతీ కుటుంబానికి ఏ వస్తువుపై ఏ మేరకు ఆదా అవుతుందో తెలియజేసేలా అవగాహన కార్యక్రమంతో పాటు ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్దేశించిన విధంగా చేపట్టవలసిన అవగాహన కార్యక్రమాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు , ప్రభృతులు పాల్గొన్నారు.
