ఏలూరు మున్సిపల్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య.


 ఏలూరు మున్సిపల్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య.

 ఏలూరు,  మున్సిపల్ ఆప్కాస్ కార్మికుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాల పెంచాలని, రిటైర్ అయిన, చనిపోయిన ఆప్కాస్ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 8వ తేదీన మున్సిపల్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కార్మికుల వయస్సు పెంచకపోవడం అన్యాయం అని అన్నారు. చనిపోయిన లేదా రిటైర్ అయిన వారికి ఎలాంటి గ్రాట్యుటీ చెల్లించడం లేదని అందువల్ల వారి వారసులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో సమ్మె సందర్భంగా ఒప్పందం చేసిందని కాని దానికి అనుగుణంగా జీవోలు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. వెంటనే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచడంతోపాటు చనిపోయిన, రిటైర్ అయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ జరిగే ధర్నాలో మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.నేడు 10,11 సర్కిల్లలో ఆయన 8వ తేదీ ధర్నాను జయప్రదం చేయాలని ప్రచార నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు లావేటి కృష్ణారావు నరమామిడి నాగమణి,ఏ. ఏసురత్నం, మేతర పాప, మరియమ్మ, మీనా కుమార్, లీలా కృష్ణ, నాగమణి,దేవీ తదితరులు నాయకత్వం వహించారు. 


Post a Comment

Previous Post Next Post