బాణసంచా ప్రమాదాలను జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పి.

బాణసంచా ప్రమాదాలను జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పి.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె .రామకోటయ్య. రాచర్ల మండలం ఎడవల్లి పరిధిలో గల లైసెన్స్ దీపావళి బాణసంచా గోడౌన్ ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గోడౌన్ లోని సేఫ్టీ ప్రికాషన్స్, స్టాక్ ను పరిశీలించి ఎలాంటి అనివార్య సంఘటనలు మరియు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్. మాట్లాడుతూ రాచర్ల, కొమరోలు మండల పరిధిలో లైసెన్సు లేకుండా దీపావళి టపాకాయలు అమ్మడం, నిల్వ ఉంచడం చేయరాదని, దీపావళి టపాకాయలు అమ్మదలచినవారు 3 రోజుల తాత్కాలిక లైసెన్స్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ అనుమతి పొందిన తర్వాతే అమ్ముకోవాలని అనుమతి పొందిన తర్వాత పోలీసు వారు సూచించిన ప్రదేశాలలోనే టపాకాయలు అమ్ముకోవాలని. అనుమతి లేకుండా టపాకాయలు అమ్మడం మరియు నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరం దీనిని అతిక్రమించిన చట్టపరమైన చర్యలు తీసుకోబడునని, ప్రజలు పోలీసు వారికి సహకరించి పైన తెలిపిన సూచనలు పాటించవలెను అని తెలియజేశారు.

Add



 

Post a Comment

Previous Post Next Post