సూపర్ జిఎస్టి సూపర్ సేవ్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఒంగోలు ప్రకాశం భావనం నుంచి జి.ఎస్.టి.2.0 ర్యాలీ ని జాయింట్ కలెక్టర్ .గోపాలకృష్ణ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యములో నిర్వహించినారు.
ఒంగోలు, ప్రకాశం భవనం నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ ఆడిటోరియం వరకు ర్యాలి నిర్వహించినారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ మాట్లాడుతూ....
కేంద్రప్రబుత్వం జి.ఎస్.టి.2.0 సంస్కరణల కారణంగా వైద్య చికిత్సలు పొందుటకు నిత్యం ప్రజలు ఉపయోగించే మందులు మరియు వైద్య పరికరాలు అలాగే అత్యవసర మందులు అందుబాటు ధరలో ఉండటానికి 12% నుండి 5% శాతం వరకు తగ్గించారు మరియు కొన్నిటిపై పూర్తిగా తొలగించడం వల్ల ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గన్నున్నవి మరియు ముఖ్యంగా చిన్నారులకు మరియు శిశువులకు ఉపయోగించే నాప్కిన్లు, డైపర్లు, ఫీడింగ్ బాటిల్స్ పై, వ్యక్తిగత ఆరోగ్య భీమ అంశాలపై కూడా జి.ఎస్.టి.2.0 పూర్తిగా మినహా ఇంపు ఇచ్చారని, అలాగే కాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులకు ప్రస్తుతం ఉన్న జి.ఎస్.టి.2.0 ని 28% నుండి 40% కు పెంచారని దీనితో పొగాకు వినియోగం తగ్గుతుందని తద్వారా కాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుంతుందని తెలిపారు. ఈ జి.ఎస్.టి.2.0 సంస్కరణల అమలు వల్ల వైద్య రంగానికి సంబందించిన ఆర్ధిక పరమైన ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అవగాహనా కల్పించాలని వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, డాక్టర్లు, సూపర్ వైసర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.టి.వెంకటేశ్వర్లు గారు ఆదేశించడమైనది జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాహాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లుగారు గారు - మాట్లాడుతూ.... జి.ఎస్.టి.2.0 వలన ప్రాణ రక్షక మందులు ధరలు తగ్గుతాయని , ఆరోగ్యజీవిత బీమాతీసుకోవడం సులబం అవుతుందని, ఆసుపత్రులలో ల్యాబ్ పరికరాలు చౌకగ లబిస్తాయని,ప్రజలలో ఆరోగ్యం పిట్నేన్స్ పై అవగాహనా పెరుగుతుందని, పొగాకు కూల్డ్రింక్స్ పై అధిక పన్ను ఉంటుందని, ద్రుష్టి సరిచేసి కల్లద్ధాల ధరలు తగ్గుతాయని, కాన్సర్ వ్యాధి మందుల ధరలు తగ్గుతాయని, వ్యాధినిర్ధారణ కిట్లుపరికరాల ధరలు తగ్గుతాయని, మెడికల్ గ్రేడ్ ఆక్షిజన్ ధరలు తగ్గుతాయని తెలియజేయడంజరిగినది.
అదనపు డ్రగ్ కంట్రోలర్ పి.ఎస్. జ్యోతి జి.ఎస్.టి.2.0 వలన ప్రాణ రక్షక మందుల ధరలు తగ్గుతాయని, సాధారణ మందులు 12% నుండి 5% తగ్గుతాయని,తెలిపారు ఈర్యాలి కార్యక్రమములో డ్రగ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీరామమూర్తి, సత వ్యవస్తాపక అద్యక్షులు డి కృష్ణారెడ్డి, కార్యదర్శి వేముల సుబ్బారావు గారు, ఒంగోలు రిటైల్ షాప్ అద్యక్షులు జి వెంకటరెడ్డి.హోల్సెల్ అద్యక్షులు అంకిరెడ్డి.పిసిడి అసోసే షాన్ అద్యక్షులు వి వెంకటరావు గారు. వైద్య ఆరోగ్యశాఖా తరుపన డిసిహెచ్ఎస్ డాక్టర్ యమ్ శ్రీనివాస నాయిక్. ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూరిబాబు ఆర్ బి ఏ కె నోడల్ అధికారి డాక్టర్ భాగీరధి , జిల్లా మిడియా అధికారి బెల్లం నరసింహ రావు , ఇన్చార్జి మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు డిప్యూటీ డెమో యమ్ .సరోజినీ హెల్ప్ స్వచ్ఛందసంస్థ పి డి బివి సాగర్ మరియు నర్సింగ్ విద్యార్ధులు, అధ్యాపకులు, పట్టణ ఆరోగ్యకేంద్రముల ఆరోగ్యకార్యకర్తలు, పర్యవేక్షకులు, ఆషా లు పాల్గొని ర్యాలీని విజయవంతం చేయడం జరిగినది.
Add



