మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలి.


 మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన పంపాలి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

  మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ ( సీసీఎల్ఏ ) శ్రీమతి జి.జయలక్ష్మి చెప్పారు. బుధవారం ఆమె అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 ప్రకాశం భవనం నుంచి కలెక్టర్. పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్.ఆర్.గోపాలకృష్ణ, డిఆర్ఓ.బి.చిన ఓబులేసు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. 

 మీకోసం ' అర్జీల పరిష్కారం, గృహ నిర్మాణం, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జిల్లాల విభజన తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. 

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు యువగళం పాదయాత్రలోనూ మంత్రి లోకేష్ హామీ ఇచ్చిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 

మార్కాపురం జిల్లా ఏర్పాటు కోసం ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ ప్రజాసంఘాలు కూడా ఇచ్చిన వినతి పత్రాలను క్రోడీకరించి జిల్లా ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని సిసిఎల్ఏ చెప్పారు. 

మీకోసం అర్జీలను సకాలంలో, సహేతుకంగా అర్జీదారులలో సంతృప్తిస్తాయి పెరిగేలా పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. 

ఇళ్ల స్థలాలు లేనివారికి పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసినందున ఈ మేరకు స్థలాలను, అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  

 సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, మీకోసం కార్యక్రమ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ నాగజ్యోతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవికుమార్, వివిధ అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Add 


Post a Comment

Previous Post Next Post