రోడ్డుకు ఇరువైపులా పెరిగినపిచ్చి మొక్కలు జెసిబి తో తొలగింపు.
దాసరి యోబు ప్రకాశం క్రైమ్ 9 మీడియా ప్రతినిధి.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలోని అమరావతి కడప రాష్ట్రీయ రహదారిపై శనివారం స్థానిక ఎస్సై నాగరాజు పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో రోడ్డు ప్రమాదంలో నివారణ కొరకు మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు తొలగించినట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు అన్నారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు.
