రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.



 రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ డివైఎఫ్ఐ ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. 

క్రైమ్ 9మీడియా ప్రతినిధి

 అక్టోబర్ 4 : ఏలూరు కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి సిఐటియు కార్యాలయంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ అధ్యక్షత వహించగా  ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక, లాయర్స్ యూనియన్ ఐలు, ఏఐ బిఆర్ఎస్, తదితర సంఘాలు తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లెనిన్ తదితర సంఘాల నాయకులు మాట్లాడుతూ 

 రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీపరం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించిందని కొంత పెట్టుబడి పెడితే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయగలిగిన అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న సాకుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ గిరిజన పేద ప్రజలకు విద్య వైద్యం దూరం చేయడమే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ విధానమని  ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. 

 గత ప్రభుత్వం 2021లో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో అది ఎక్కువ భాగం వెనకబడిన ప్రాంతాలలో పెట్టేందుకు నిర్ణయించిందని స్థలాలు కొనుగోలు చేసిందని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాలలో 60 శాతం ఖర్చు పెట్టిందని 2024 నాటికి ఐదు కళాశాలలు పూర్తి అయ్యి నడుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుబడితో మిగిలిన మెడికల్ కళాశాలలన్నీ పూర్తి అయ్యి అందరికీ మెడికల్ విద్య వైద్యం పెద్ద ఎత్తున అందుతుందని కానీ కూటమి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం వారికి సంబంధించిన బంధువులకు పెట్టుబడుదారి మిత్రులకు ఈ విద్యాసంస్థలను కారు చౌకగా ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రజలకు భావితరాల భవిష్యత్తును నాశనం చేసేందుకే పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు

 మాటలకే పరిమితం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీలు జీతాలకు మరియు వారి బస్సులకు ఖర్చుపెట్టి రీతిలో ప్రజలకు భావితరాలకు విద్యా వైద్యం అందించవలసిన బాధ్యతను మర్చిపోతున్నారని ఇవ్వగలం పాదయాత్రలో లక్షల రూపాయలకు సీట్లు అమ్ముతున్నారని ప్రచారం చేసిన నారా లోకేష్ ఇప్పుడు ఏ బి సి ప్రతిపాదికన 20 లక్షల నుండి 50 లక్షల రూపాయలకు మెడికల్ సీట్లు అమ్మేదిశగా ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని తక్షణమే పిపిపి విధానాన్ని ఉపసంహరించి ఎన్నికల హామీలు భాగంగా ఇచ్చిన వాగ్దానాలతో వందకు వంద శాతం ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను విద్యాసంస్థలను నడపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డివైఎఫ్ఐఎ స్ ఎఫ్ ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కలిసొచ్చే ప్రజా ప్రజాతంత్ర సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపుదిద్దుతామని హెచ్చరించారు.

 ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం నాయకులు పివీ నారాయణ, సుధాకర్, లాయర్స్ యూనియన్ విజయభాస్కర్, ఏఐబిఎస్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post