అమ్మవారి సేవలో పోలీసులు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు అమ్మవారి సేవలో తరించారు. మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు, కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్,మల్లికార్జున, మరియు అర్ధవీడు బేస్తవారిపేట, కంభం మండలాలకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు. బి నరసింహారావు. రవీంద్రారెడ్డి, నాంచారయ్య,లు అమ్మవారి పల్లకి మోసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.
