హేలాపురి ఉత్సవం అర్ధవంతంగా నిర్వహించాలి.
షాపింగ్ ఫెస్టివల్ లో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేయాలి.
అధిక మొత్తంలో కొనుగోలు చేసిన ముగ్గురికి బహుమతులు.
ఉత్సాహ పరిచే సాంస్కృత కార్యక్రమాలు నిర్వహించాలి.
హేలాపురి ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.
ఏలూరు, అక్టోబర్, 11: సూపర్ జిఎస్టి... సూపర్ సేవింగ్స్ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏలూరు సర్. సి. ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో నిర్వహించనున్న నిర్వహించనున్న హేలాపురి ఉత్సవం ప్రజలకు ఉపయోగపడేలా అర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సెల్వి అధికారులను ఆదేశించారు. హేలాపురి ఉత్సవం ఏర్పాట్లపై శనివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిఎస్టి ఫలాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు షాపింగ్ ఫెస్టివల్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. షాపింగ్ ఉత్సవంలో పెద్ద ఎత్తున స్టాల్స్ ను ఏర్పాటు చేసేలా వర్తకులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను మరింత ఉత్సాహపరిచేందుకు హేలాపురి ఉత్సవం సమయంలో అధిక మొత్తంలో షాపింగ్ చేసిన వారి పేర్లను ఉత్సవం చివరి రోజున డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందజేయాలన్నారు. హేలాపురి ఉత్సవ ఆవరణలో ఫుడ్ కోర్ట్ లు వంటివి ఏర్పాటుచేయాలనీ, చిన్న పిల్లలను ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా హేలాపురి ఉత్సవాలు నిర్వహించాలని, వర్షం వస్తే ప్రజలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. జిల్లా అధికారులు అందరూ వారి కుటుంబ సభ్యులతో జిల్లా అధికారులు అందరూ వారి కుటుంబ సభ్యులతో హేలాపురి ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పారు. హేలాపురి ఉత్సవం ఆవరణలో పటిష్టమైన భద్రతా చర్యలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, వాణిజ్య పనులు శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జున రావు, ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్, వివి జిల్లా సమాచారం సేక ఏలూరు జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Add

