స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ముత్తుమల్ల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశ పెట్టడం ద్వారా పౌరసరఫరాల వ్యవస్థలో నూతన అధ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి తెలియజేశారు. ప్రస్తుత రేషన్ కార్డుల స్థానంలో క్యూ.ఆర్. కోడుతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల కంభం మండల కేంద్రంలో పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు శనివారం నిర్వహించారు. శాసనసభ్యులతో పాటు మండల తాసిల్దార్ విడుదల కిరణ్ కుమార్. ప్రవీణ్ సిబ్బంది మండల అభివృద్ధి శాఖ అధికారి. వీరభద్ర చారి. స్థానిక కూటమి నాయకులు. మార్కెట్ యార్డ్ చైర్మన్ భూపాల్ రెడ్డి. సొసైటీ బ్యాంక్ చైర్మన్ కేతం. శ్రీను. కొత్తపల్లి శ్రీను. ఎస్సీ సెల్ నాయకులు సిరివెళ్ల రవికుమార్. గోన చెన్నకేశవరావు, తోట శ్రీనివాస రావు. ఆరేపల్లి మల్లికార్జునరావు. కోళ్ల ప్రసన్న. సోమయ్య.ముస్లిం మైనార్టీ నాయకులు రజాక్. అల్తాఫ్. జనసేన నాయకులు తాడిశెట్టి ప్రసాదు. హర్షద్. ఓ మాధవ్. రేషన్ డీలర్లు తదితరులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక తాసిల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ. ఈరోజు మండలం మొత్తము 12 వేల రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల్ల అశోక్ రెడ్డి మాట్లాడుతూ,ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దీపం-2, స్త్రీశక్తి, ఆటో డ్రైవర్ల సేవలో వంటి కార్యక్రమాల ద్వారా ఆ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకువచ్చిందని, సమగ్ర వివరాలతో ఇదే మాదిరిగా స్మార్ట్ పాస్ బుక్కులు కూడా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. అనంతరం స్థానిక శిరిడి సాయిబాబా దేవాలయంలో. సాయిబాబాను దర్శించుకున్నారు.
Add


