మంత తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అప్రమత్త చర్యలు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.
అనకాపల్లి, అక్టోబర్ :26
వచ్చే కొన్ని రోజుల్లో వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని అవసరమైన చర్యలను చేపట్టారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, తెలిపారు.
ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు స్థానిక తహసీల్దార్లు, రెవెన్యూ, మత్స్య, పంచాయతీ అధికారులు మరియు జిల్లా యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తూ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.
ఎస్పీ ప్రజలకు మరియు పర్యాటకులకు క్రింది జాగ్రత్త సూచనలు ఇచ్చారు:
రేపటినుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సముద్రతీర ప్రాంతాలకు వెళ్లరాదు.
మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు వెళ్లరాదు.
అన్ని పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగంతో నిరంతర సమన్వయం కొనసాగించాలి.
ప్రజలు అత్యవసర అవసరం లేకుండా తీరప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలి.
స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, రూమర్లు లేదా తప్పుడు సమాచారం నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ తుహిన్ సిన్హా, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్ సిద్ధంగా ఉన్నాయన్నారు. “మంత తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్ లేదా 112 నంబర్ ద్వారా వెంటనే సమాచారం ఇవ్వాలని” సూచించారు.
