మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం ర్యాలీ విజయవంతం చేయండి.
బూరె బాబురావు మండల వైస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు.
అనకాపల్లి అక్టోబర్:26 దేవరపల్లి.
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు28,మంగళవారం ఉదయం 10:00 గం.లకు మాడుగుల నియోజకవర్గం, మాడుగుల మండల ప్రధాన కేంద్రం వద్ద రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యులు బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో
మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమంలో భాగంగా నియోజకవర్గం స్థాయి నిరసనలు ర్యాలీ కార్యక్రమం జరగుతుంది కనుక
ఈ యొక్క కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు,రాష్ట్ర, జిల్లా పార్టీలో వివిధ హోదా కలిగిన పార్టీ నాయకులు,మండలం పార్టీ అధ్యక్షులు,జిల్లా అనుబంధ విభాగల అధ్యక్షులు,మండల అనుబంధ విభాగల అధ్యక్షులు మరియు
గ్రామ స్ధాయి నాయుకులు అందరూ తప్పక హాజరు అవ్వగలరని మనవి.
ప్రతి గ్రామం నుండి ఇరవై మందికి తక్కువ లేకుండా పైన తెలిపిన సమయానికి తప్పకుండా హాజరై కార్యక్రమం విజయవంతం చేస్తారు అని వినయపూర్వకంగా తెలిపారు.
Add

