మోంథా తుఫాను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం సిద్ధంగాఉండాలి.


 మోంథా తుఫాను ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం

సిద్ధంగాఉండాలి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా ఒంగోలు

మొంథా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లతో పూర్తి సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. 

మొంథా తుపాను నేపధ్యంలో సోమవారం ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ. బి.చిన ఓబులేసుతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మొంథా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై వివరిస్తూ, ఈ రోజు రాత్రి నుండి జిల్లాలో మొంథా తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపధ్యంలో మొంథా తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుండి చిన్న చిరుజల్లు మొదలైందని, రాత్రికి ఉదృతి అయ్యే అవకాశం ఉందని వాతావారణ శాఖ హెచ్చరించడం జరిగిందన్నారు. తుఫాన్ ప్రభావం ఏమిలేదని అనుకోకుండా ప్రజలు బయటకు రావద్దని, కొన్ని సార్లు అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు వచ్చి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని, కొన్ని సార్లు ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. మొంథా తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లా పై ఈ రోజు రాత్రి నుండి రేపు, ఎల్లుండి 27, 28 తేదీల్లో ఉండే అవకాశం ఉన్నందున, ఈ రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించే అవకాశమున్నందున, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని జిల్లా కలెక్టర్, జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులను కేటాయించడం జరిగిందని, ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందన్నారు.   

ముఖ్యంగా తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రోజు డ్రై రన్ కుడా నిర్వహించడం జరిగింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎంత సమయంలో తరలించడం జరుగుతుంది, చెట్లు పడిపోతే ఆ ప్రదేశాలకు ఎంత సమయంలో చేరుకుంటాం అనే విషయాలపై ట్రయిల్ రన్ లాంటిది నిర్వహించడం జరిగిందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి సంబంధిత శాఖల నుండి ఒక సీనియర్ అధికారిని ఇందులో నియమించడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలను ప్రతి గంటకు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ కు తెలియచేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్, టెలి కాన్ఫెరెన్స్ నిర్వహించి గతంలో వచ్చిన తుఫాన్ పరిస్థితుల ప్రభావాలను ప్రస్తావిస్తూ చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశంచేయడంజరిగిందన్నారు. అంతే కాకుండా తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు. వారి సారద్యంలో వారి సూచనలు కూడా తీసుకుంటూ జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. 

ఈ రోజు రాత్రి నుండి రేపు, ఎల్లుండి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశ్చిమ ప్రకాశం ప్రాంత పరిధిలో ప్లాష్ ప్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ దూర ప్రాంత ప్రయాణాలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. 

రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి తుఫాన్ నష్టాలు లేకుండా అధికమించే అవకాశం ఉందన్నారు. తుఫాన్ నేపధ్యంలో 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల్లో త్రాగునీరు, భోజన వసతి, విద్యుత్ పొతే జనరేటర్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుచున్నదన్నారు. తుఫాన్ సమయంలో కమ్యూనికేషన్ ముఖ్యం కాబట్టి సెల్ ఫోన్ టవర్స్ వద్ద పవర్ బ్యాకప్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సెల్ కంపెనీల ప్రతినిధులకు సూచించడం జరిగిందన్నారు. అలాగే ఆన్నీ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు సిద్దంగా ఉంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది కలెక్టర్ వివరించారు. జేసిబి, ట్రాక్టర్స్, పవర్ సాసేస్ను సిద్దంగా ఉంచడం జరిగిందన్నారు. జిల్లాలోని 799 ట్యాంక్స్ లో సుమారు 50 ట్యాంక్ లు పూర్తీ నీటి సామర్ధ్యంతో ఉండటంతో ప్రతి ట్యాంక్ వద్ద ఒక అధికారిని నియమించి పర్యవేక్షించడం జరుగుచున్నదన్నారు. అన్నీ శాఖలు పూర్తి యాక్షన్ ప్లాన్ తో జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Add


Post a Comment

Previous Post Next Post