మోంథా తుఫాను ప్రాంతంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి రాజబాబు.ఆదేశాల మేరకు
ప్రకాశం జిల్లా, డాక్టర్ టి. వెంకటేశ్వర్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి. మాట్లాడుతూ
మొంథా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్నందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.వాతావరణ శాఖ తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 27 నుండి 28 వరకు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం ప్రకాశం జిల్లా పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.
ఈ రెండు రోజులపాటు భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు విచే అవకాశమున్నందున, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ పి రాజబాబు ముఖ్య సూచనలు ఇవ్వటం జరిగింది.
వర్షప్రభావంతోఇంటికే పరిమితం అవ్వండిఅత్యవసర పరిస్థితులో తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ వర్షంలో బయటకు వెళ్లవద్దు. అనవసర ప్రయాణాలుపూర్తిగారద్దు చేసుకోవాలని అన్నారు
పిల్లల భద్రత తల్లి తండ్రులబాధ్యత
తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించి, నీరు చేరిన ప్రాంతాలు, వాగులు, వంకలు, చెరువులు వంటి ప్రదేశాలదగ్గరికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.హెచ్చరించారు.
వాగులు, వంకలు, నదులు ప్రస్తుతం ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. సరదాగా ఈత, స్నానంకోసం నీటిలోదిగకుండా.ఈవిధంగాప్రాణ లనుప్రమాదంలోపెట్టుకోవద్దు.
సురక్షితప్రాంతాలకుతరలింపు-గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారు వర్షాల సమయంలో ఆ ఇళ్లలో ఉండకూడదన్నారు.అధికారులు సూచించినప్పుడు వెంటనే పునరావాసకేంద్రాలులేదాబంధువుల ఇళ్లకు తరలివెళ్ళాలి.
రెండు రోజుల సన్నద్ధత
అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు, టార్చ్ లైట్లు, మందులు మొదలైనవి ముందుగానే సిద్ధం చేసుకోవలన్నారు.
అత్యవసర సహాయం కోసం
ఏదైనా ప్రమాదం గమనించిన , విద్యత్ వైర్లు తెగిపడిన చెట్టు కూలిన నీరు ఇళ్లలోకి చేరిన వెంటనే సమాచారం ఇవ్వాలి.తుఫాను అత్యవసర పరిస్థితులలో టోల్ ఫ్రీ నంబర్లకు. 108 మరియు 102 మరియు 104 సేవలకు డాక్టర్ పి. హేమంత్ యాన్.టి.ఆర్ వైద్యసేవ ప్రకాశం జిల్లా డి.సి. మొబైల్ నెంబర్ 9618202424 సమాచార ఇవ్వాలని అన్నారు.
కలెక్టర్ హెచ్చరిక:-
ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా, తుఫాన్ తీవ్రతపై తప్పుడు సమాచారం లేదా వదంతులు సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి) పంచుకునే వ్యక్తులపై జిల్లా పోలీస్ శాఖ కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.ఈ విపత్తు సమయంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండి, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలన్నారు.
ప్రజల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను కచ్చితంగా పాటించి, సహకరించగలరని ప్రకాశం జిల్లా, కలెక్టర్ పి రాజబాబు ప్రజలకు తెలియజేశారు.
Add

