ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం లో ఘనంగా మాజీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కోమాకుల శ్రీను (పూల శ్రీను) పుట్టినరోజు వేడుకలు.
అక్టోబర్ 03:- ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కోమాకుల శ్రీను (పూల శ్రీను) గారి పుట్టినరోజు వేడుకలను నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్డి అప్పల నాయుడు గారు హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నగిరెడ్డి కాశీ నరేష్ గారు, కోమాకుల శ్రీను గారు సంపూర్ణ, ఆయురారోగ్యాలతో ఉండాలని నిత్యం ప్రజలతో మమేకమై పార్టీ కోసం శ్రమిస్తున్న వీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన దీవించారు.
నగిరెడ్డి కాశినరేష్, కోమాకుల శ్రీను మాట్లాడుతూ మాకు ఈ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మా అన్నయ్య రెడ్డి అప్పల నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఏలూరు నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు, నా తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


