అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ముత్తుముల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
కార్తీక మాస ప్రారంభోత్సవం, సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు..
ఆయన స్వగ్రామమైన కొమరోలు మండలం, హనుమంతరాయుని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికీ పట్టు వస్త్రాలను సమర్పించీ. స్వామి వారికీ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యే మరియు కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలను అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందచేశారు.
స్వంత గ్రామానికి వచ్చిన శాసనసభ్యులను కలిసేందుకు స్థానిక ప్రజలు, చుట్టు పక్క గ్రామాల ప్రజలు రావటంతో ఎమ్మెల్యే వారితో ఆత్మీయంగా పలకరించి యోగాక్షేమాలను అడిగి, గ్రామాల్లోని పరిస్థితులను గురించి తెలుసుకున్నారు..
ఈ పూజా కార్యక్రమంలో అయన సతీమణి పుష్పలీల, కుమారులు దివ్యేష్, భవజ్ఞ, సోదరులు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సంజీవ రెడ్డి, వారి సోదరి గీత, తదితర కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.

