ఊళ్ళ పాలెం గ్రామాన్ని సందర్శించిన ప్రకాశం కలెక్టర్.



 ఊళ్ళ పాలెం గ్రామాన్ని సందర్శించిన ప్రకాశం కలెక్టర్. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

జిల్లాలోభారీ వర్షాల నేపథ్యంలో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు సింగరాయకొండ మండలం, ఊళ్ళపాలెం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులతో మాట్లాడటం జరిగింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని జిల్లా కలెక్టర్, మత్స్యకారులకు తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్, ఊళ్ళపాలెం గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ ను సందర్శించి అత్యవసర వైద్య సేవలకు సంబంధించి మందులు ఉన్నాయా లేవా అని పరిశీలించి, అవసరమైన మందులు సిద్ధంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. 

 గ్రామ సచివాలయం పరిసరాలు శుభ్రంగా లేకపోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సాయంత్రం నాటికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. 

అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను సందర్శించి అవసరమైతే పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేయుటకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Add 


Post a Comment

Previous Post Next Post