నల్లారాయి క్వారీని నిలుపుదల చేయాలని ప్రజలు పెద్దఎత్తున నిరసన.
తుది రిపోర్ట్ ని ఉన్నత అధికారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఆర్ డి ఓ.
నల్లారాయి క్వారీ భాధితుల గోడు పట్టించుకోని జిల్లా కలెక్టర్.
కాసుల మత్తులో అధికారులు - ఇకనైనా మత్తు వీడి భాధితులకు న్యాయం చెయ్యమని వేడుకొంటున్న వైనం.
క్రైం 9మీడియా ప్రతినిధి బి. ఎ. రావ్.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం సర్పవరం రెవిన్యూ పరిధిలో సర్వేనెంబర్216.new 231.232.లో 4.79 యాక్టర్ విస్తీర్ణం గల శ్రీ ఎల్ రాజు రోడ్డు మెటల్. బిల్డింగ్ స్టోన్ నలరాయి తీసేందుకు అనుమతులు పొందుతున్నారు. ఈ క్వారీ ఆనుకొని రాజన్నపేట. గదభపాలెం గ్రామాల్లో 300 మంది పి. వి. టి. జి. గదభ మరియు భగత. దళితులు. ఇతర పేదలు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ క్వారీ భారీ బాంబ్ బ్లాస్టింగ్ ల వల్ల 40 ఇండ్లు బీట్లు వారి పోయాయి. రామాలయం గుడి కూడా బీట్లు వారి పోయింది. భారీ శబ్దానికి. టీవీలు కూడా కాలిపోయాయి. చిన్నపిల్లలు బ్లాస్ట్ చేసే సమయంలో గుండెలు అదిరిపోతున్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కి. నర్సీపట్నం ఆర్డీవో కి. ఫిర్యాదు చేయగా నర్సీపట్నం మైన్స్ అధికారి క్వారీని పరిశీలన చేశారు. ఫిర్యాదు చేసిన ఇల్లులు మాత్రం పరిశీలన చేయలేదు. రోలుగుంట మండల రెవెన్యూ అధికారి గత నెల 8 తేదీన స్వయానా బాంబ్ బ్లాస్టింగ్ తో బీట్లు వారిని ఇళ్లను స్వయంగా పరిశీలించారు. నేటికీ పరిచయం చేసిన రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించలేదు. తక్షణమే పరిశీలన చేసిన రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించి తమకు న్యాయం చేయాలని. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా. మహాత్మ నల్లరాయి క్వారీ బాంబ్ బ్లాస్టింగ్ నుండి మా గ్రామాన్ని. 40 క్వారీ మైనింగ్ అనుమతులు తక్షణమే రద్దు చేయాలని గిరిజనులు దళితులు పేదలు చేతులు జోడించి వేడుకోవడం జరిగింది. తక్షణమే పరిశీలన చేసిన రిపోర్టుని బహిర్గతం చేయకపోతే నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంతో ఉరుతాలతో ఆందోళన నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యులు బోనంగి రామ లక్ష్మి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. మహిళా సంఘం నాయకులుM కృష్ణవేణి రైతు సంఘం నాయకులు.ఇర్ల రాంబాబు నువ్వలా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
