దీపావళి సందర్భంగా బాణాసంచా నిల్వ, విక్రయ కేంద్రాల తనిఖీ.

దీపావళి సందర్భంగా బాణాసంచా నిల్వ, విక్రయ కేంద్రాల తనిఖీ.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి,(నాతవరం) అక్టోబర్ 11: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు, ఈ ఉదయం నాతవరం గ్రామ పరిసర ప్రాంతంలో ఉన్న లైసెన్స్ పొందిన “అయ్యప్ప ఫైర్‌వర్క్స్” నిల్వ మరియు విక్రయ కేంద్రాలను, ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో కలిసి, ఎస్‌ఐ నాతవరం వై.తారకేశ్వరరావు పరిశీలించారు.

ఈ సందర్భంగా భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా అనే అంశంపై తనిఖీలు నిర్వహించడంతో పాటు, ప్రమాద పరిస్థితుల్లో సిబ్బంది తక్షణ స్పందన చూపేలా “ఎమర్జెన్సీ డ్రిల్” కూడా నిర్వహించారు.

జిల్లా ప్రజల భద్రత కోసం బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలు తప్పనిసరిగా అన్ని భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు సూచించారు.

Add



 

Post a Comment

Previous Post Next Post