వైన్ షాపులను తనిఖీలు నిర్వహించిన ప్రొహిబిషన్ అధికారులు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో, ఈరోజు కంభం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బందితో కలిసి స్థానిక కంభం పట్టణంలోని ఐదు వైన్ షాపులను తనిఖీ లు నిర్వహించడం జరిగింది. సదరు వైన్ షాపుల్లో మద్యం ఎంఆర్పీ ధరలకు విక్రయించబడుతున్నదో లేదో తెలుసుకోవడం నిమిత్తం ముందుగా ప్రతి షాపుకు ఒక డేకాయ్ పంపించి, మద్యం బాటిల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అయితే తద్వారా సేకరించిన సమాచారం ప్రకారం, అన్ని షాపులలో మద్యం బాటిల్స్ ఎంఆర్పీ ధరలకే అమ్ముతున్నట్లు గమనించబడింది. అనంతరం, సదరు ఐదు వైన్ షాపులను క్షుణ్ణంగా పరిశీలించగా ఎటువంటి అక్రమలు జరగలేదని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.
Add

