దేవాదాయభూములుఅన్యాక్రాంతం కాకుండా చూడండి అధికారులకు కలెక్టర్ ఆదేశం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జిల్లాలోని దేవాలయాల అభివృద్ధి తో పాటు ఆ దేవాలయాల ప్రాశస్త్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, జాతర్లు, ఉత్సవాలు గురించి ప్రజలకు తెలిసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం కలెక్టరెట్లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై అసిస్టెంట్ కమీషనర్, జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 1,001 దేవాలయాలు, సత్రాలు వున్నాయని, అందులో 12 పురాతన మరియు చారిత్రక దేవాలయాలు ఉన్నాయని, 38,866.95 ఎకరాల భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉందని తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రుపొందించాలన్నారు. ఆ దేవాలయాల ప్రాశస్త్యం, చరిత్ర, జాతర్లు, ఉత్సవాలు గురించి ప్రజలకు తెలిసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, దేవాదాయ అసిస్టెంట్ కమీషనర్ ను ఆదేశించారు.
తొలివిడత జిల్లాలో సుమారు 20 పురాతన మరియు చారిత్రక దేవాలయాలను గుర్తించి ఆ దేవాలయాల ప్రాశస్త్యం, చరిత్రతో పాటు ఆ దేవాలయాల పరిధిలో నిర్వహించే ఉత్సవాలు, జాతర్లు ప్రజలకు తెలియచేసేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ ఉత్సవాలు, జాతరలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
జిల్లాలో దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ పానకాల రావు, సుపరింటెండెంట్ శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Add


