గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ఘనంగా నిర్వహించారు.



 గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ఘనంగా నిర్వహించారు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ లోని పి జి ఆర్ ఎస్ హాల్లో జరిగిన గ్లోబల్ హ్యాండ్ వాష్ డే కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ మరియు విజయ వాణి చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ అధ్యక్ష వహించారు చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా జీవితంలో నిజమైన హీరోలుగా మిగిలిపోతారని అన్నారు. ఆరోగ్యం ఆనందం అభివృద్ధి అనేది పరిసర పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా కలిగి ఉండడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు. కనెక్షన్ క్రమశిక్షణతో జీవితాన్ని ముందుకు నడిపించాలి అంటే ఆరోగ్యం తో మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రజలు చైతన్యవంతులై సమాజానికి అవసరమైన విద్యను వివేకాన్ని అందించాలని పిలుపునిచ్చారు. 

జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా డి వార్మింగ్ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం రాదు అన్నారు. అంతే కాకుండా డబ్ల్యూహెచ్ఓ సూచించిన విధంగా ఏడు రకాలుగా చేతులను శుభ్రంగా కడుకోవాలని భోజనానికి ముందు తర్వాత మరుగుదొడ్లు వాడిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలు చేసిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 

మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గారు మాట్లాడుతూ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్లోబల్ హ్యాండ్ వాష్ డే ప్రాధాన్యతను వివరించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ వీరభద్రుడు రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరా శుభాకాంక్షలు వ్యక్తిగత శుభ్రతను కూడా పాటించాలని అందులో భాగంగా భోజనానికి ముందుగా తరువాత సూచించిన ప్రకారం ఏడు మార్గాల ద్వారా చేతులు శుభ్రంగా కడుకోవాలని తెలియజేశారు. ముఖ్యమైన ఏడు సందర్భాలలో చేతులను కడుక్కోవడం అలవాటుగా చేసుకోవాలని తెలియజేశారు అందరూ భాగంగా దగ్గు లేదా తుమ్ము ల తర్వాత అనారోగ్య వ్యక్తికి సేవలు చేసే ముందు తర్వాత కలుషితమైన వివిధ ఉపరతలాలను తాకినప్పుడు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆహారాన్ని తయారు చేసే ముందు తినడానికి ముందు మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత మరియు చెత్త మరియు వ్యర్ధాలను పారవేసిన తరువాత వంట కార్యక్రమాలను నిర్వహించడానికి ముందుగా తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా సురక్షితమైన జీవితాన్ని పొందవచ్చు అని తెలియజేశారు. ఈ సందర్భంగా చేతులను శుభ్రంగా కడుక్కునే పద్ధతులను విద్యార్థులతో చేసి చూపించారు. కార్యక్రమానికి ముందుగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా నిజ జీవితంలో అందరూ హీరోలుగా ఉండాలని అందుకు 60 రోజులు క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి అని ఇది ఒక అలవాటుగా కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పిలుపునిచ్చారు. కళాజాత కార్యక్రమము ద్వారా పాటలు మరియు నాటకం రూపంలో ఆహుతులను అలరించారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సెల్ఫీ స్టాండ్ లో హాజరైన విద్యార్థులు మహిళలు పోటీలు పడి సెల్ఫీలు తీసుకొని వాటిని వాట్సప్ గ్రూపులలో తమ స్నేహితులకు బంధువులకు పంపడం ప్రత్యేకతగా నిలిచినది. 

విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అనేది దాని యొక్క ప్రాముఖ్యతను కరోనా సమయంలో ప్రజలందరికీ స్వీయ అనుభవం అని అన్నారు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది చేతులు శుభ్రంగా ఉంటే ఆరోగ్యం ఆనందం ఉంటుందని అన్నారు. 

స్టెప్ మరియు యూత్ స్పోర్ట్స్ జిల్లా అధికారి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, యువత ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని సెల్ఫీ స్టాండ్ లో చూపించిన విధంగా 9 రకాల పనులు చేసిన తర్వాత ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉమన్ చైల్డ్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ గారు విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ టి రంగారావు గారు మరియు వాష్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం శ్రీనివాసరావు ప్రోగ్రాం ప్రతినిధి కె మరియు బాబు గారు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post