ఏలూరులో ఘనంగా ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే వేడుకలు.



ఏలూరులో ఘనంగా ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే వేడుకలు.

ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ  రెడ్డి అప్పల నాయుడు 

అక్టోబర్ 15:- ఏలూరులో వైట్ కేన్ దినోత్సవం వేడుకలను బుధవారం జన్మభూమి పార్క్ వద్ద ఉన్న యాదవ సంఘం సమావేశ మందిరంలో విజువల్లి ఛాలెంజ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు, ఏపీఎన్జీవో రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్.హరనాధ్, ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజువల్లి ఛాలెంజెడ్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు వీరభద్రరావు మాట్లాడుతూ గతంలో రెడ్డి అప్పలనాయుడు గారు సర్పంచ్ గా ఉన్న సమయంలో మాకు చాలా సందర్భాల్లోనూ సహాయ సహకారాలు అందించారు. వారికి మా డిపార్ట్మెంట్ అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. మా కోసం రెడ్డి అప్పలనాయుడు గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు 1150 గజాల స్థలాన్ని మా అంధుల పాఠశాల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ఈ విషయంలో రెడ్డి అప్పలనాయుడు గారికి మేము ఎంతగానో రుణపడి ఉన్నామన్నారు. దృష్టి లోపం ఉన్న ఎంతోమంది పిల్లలు అక్కడే చదువుకుని ప్రయోజకులు అయ్యారు. ఎంతోమంది దేశ విదేశాల్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. రెడ్డి అప్పలనాయుడు గారి రూపంలో మాకు ఆరోజున అన్ని సౌకర్యాలు సమకూరాయని వారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈరోజున దృష్టి లోపం ఉన్నవారు పడుతున్న బాధలను ఆర్టీసి జోనల్ రెడ్డి అప్పల నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తమ సమస్యల్ని తీసుకెళ్ళాలని వారు కోరారు. అంతేకాకుండా ఆర్టీసీ లోను అంధులకు రాయితీ కల్పించాలని రెడ్డి అప్పల నాయుడు గారిని వారు కోరారు. ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ చూపు కోల్పోయిన నా సోదర సోదరీమణులకు, వారికి కావలసిన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సాటి మానవులుగా మనఅందరి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంతైనా ఉందన్నారు. వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లోను తగిన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈరోజున మనం జరుపుకుంటున్నది వైట్ కెన్ డే. ఇది ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటాం. 1964లో అమెరికా అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఈరోజును అధికారికంగా ప్రకటించారు అప్పటినుంచి ప్రపంచమంతా ఈ దినాన్ని పాటిస్తుందన్నారు. వైట్ కాన్ అంటే కేవలం ఒక కర్ర కాదు, ఇది దృష్టి లోపం ఉన్నవారికి కల్లు లాంటి స్నేహితుడు అని అన్నారు. ఈ కర్ర వాళ్లకు దారి చూపుతుంది. చూపు కోల్పోయిన వారికి ధైర్యం ఇస్తుంది. స్వతంత్రంగా నడవడానికి సహాయపడుతుంది. ఇది వారికి ఆత్మవిశ్వాసం, గౌరవం, స్వేచ్ఛ ఇస్తుంది. మన సమాజానికి వైట్ కేన్ ఒక సందేశాన్ని ఇస్తుందన్నారు. దృష్టిలోపం ఉన్న వారిని మనం గౌరవించాలి. వారికి సహాయం చేయాలి కానీ కనికరంతో కాదు గౌరవంతో. రోడ్లు, పాఠశాలలు, ఆఫీసులు అన్ని అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. ఈరోజున మనం అందరికీ గుర్తు చేస్తున్నాం. దృష్టిలోపం ఉన్నవారు కూడా మనలాగే స్వతంత్రంగా జీవించగలరు. చూపులేని వారు కలలు కంటారు సాధిస్తారు కూడా. విద్యార్థులు యువత ఈ రోజు గురించి అవగాహన కలిగి ఉండాలి. స్కూల్స్, కాలేజీల్లో ప్రసంగాలు, ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేయాలి. చివరిగా చెప్పేది ఒకటి వైట్ కేన్ డే అనేది కేవలం కర్ర కాదు. అది చూపు కోల్పోయిన వారికి ఆశ, ధైర్యం, స్వాతంత్రం సమాన హక్కుల ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో విజువల్లి ఛాలెంజ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి జి. రాధ రాణి, ఏలూరు జిల్లా అధ్యక్షులు జి. డి. వి. ఎస్. వీర భద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. మదన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్. కర్ణుడు కోశాధికారి వై. రమేశ్, పలువురు చూపులేనివారు పాల్గొన్నారు..

Post a Comment

Previous Post Next Post