మత్స్య కారుల ఉద్యమం పై పోలీసులు ఉక్కుపాదం.

మత్స్య కారుల ఉద్యమం పై పోలీసులు ఉక్కుపాదం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:17

దేవరాపల్లి, నక్కపల్లి మండలం లం రాజయ్య పేటలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న పోరాటం పై (పోలీసులు) ప్రభుత్వం ఉక్కు పాదంతో అనిచి వేసి మత్స్య కారులను ప్రభుత్వ భయ బ్రాంతులకు గురి చేసుందని దీన్ని మత్స్యకారులు ఐక్యంగా ఆడ్డుకుని తీరుతారని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు శుక్రవారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు రాజయ్య పేటలో ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దని నెలలు తర బడి మత్స్య కారులు అందోన చేస్తుంటే వారి మనో భావాలను పరిగణం లోకి తీసు కోకుండా ప్రభుత్వ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడం కోసం మత్స్యకారులు ఉద్యమంపై ఉక్కు పాదం మోపాలని చూస్తుందని దీనికి తగిన మూల్యం చేల్లించు కోక తప్పదని హెచ్చ రించారు వందలాది మంది పోలీసులు బందో బస్తుకోసం నక్కపల్లిపల్లి మండలం,రాజయ్య పేట చేరుకున్నారన్నాని తెలిపారు.సివిల్ పోలీసులతో పాటు,ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు,స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించి భయ పెట్టడం కోసం గ్రామంలో కవాతు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇంటికో పోలీసు,వీధికో పికెట్ అన్నట్లుగా రాజయ్య పేటలో ఉందన్నారు ప్రస్తుతం రాజయ్య పేట మత్స్యకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు హింసాత్మక ఘటనలు జరగ కుండా ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులను భారీగా మోహరించామని చేబుతున్నారని ఇందులో వాస్తవం లేదన్నారు సాంతి యుతంగా అందోన చేస్తున్న మత్స్యకారులను పోలీసులే రెచ్చ గోడుతున్నారని తెలిపారు రాజయ్యపేట గ్రామాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ద మన్నారు గ్రామానికి వెళ్లే అన్ని మార్గాల్లో పోలీస్ చెకో పోస్టులు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారని అన్నారు ఉపమాక రోడ్డు ఆర్చి వద్ద,ఉప మాకలో,బుచ్చిరాజు పేట, బోయపాడు, దొండ వాక, సిహెచ్ఎల్ పురం కూడళ్లలో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారని.బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరిగే ప్రాంతాలకు వెళ్లే రోడ్లలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆటోలను ఆయా కూడళ్ల లో అడ్డుకుని ఆటోలు రాక పోకలు సాగించే వారు ఎవరు, ఎక్కడ నుంచి వస్తున్నారు. ఎక్కడకు వెళ్తున్నారనే వివరాలను తెలుసుకుంటు న్నారని తెలిపారు యూనిఫాంలో ఉన్నవారితోనే కాకుండా మఫ్టీలో కూడ కొంతమంది పోలీసు సిబ్బందిని రంగంలోకి దించారని తెలిపారు.ఇప్పటికే మత్స్యకారులపోరాటానికి మద్దతు తెలిపిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి యం అప్పల రాజును పది రోజులు నుండి గ్రుహా నిర్బంధంలో ఉంచారని ఇది అత్యంత హెయమైన చర్య అని పేర్కొన్నారు బల్క్ డ్రగ్ ఉద్యమంతో మత్స్యకారుల జీవనోపాధి పోకుండా కాపాడుకోవాలని చూస్తుంటే ప్రభుత్వం ఇటువంటి ఘాతు కానికి పూను కుంటుందని తెలిపారు మత్స్యకారులు మాత్ర తాడో పేడో తేల్చు కుంటామని, ప్రాణాలు పోయినా బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని మత్స్యకారులు పట్టుదలగా ఉన్నారని తెలిపారు ఆందోళనకు టీడీపీ నాయకులు దూరంగా ఉండి రాజకీయమే!లక్ష్యంగా వ్యహరిస్తున్నారని తెలిపారు రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ఉద్యమం రాజకీయ రంగు పులుమి మత్స్యకారులు ఉద్యమాన్ని నీరుగార్చాలని అది కారపార్టి ప్రయత్నాలు పలించ లెదెన్నారు గంగపుత్రులులంతా గ్రామం కోసం,వారిప్రాణాల కోసం పోరాటం చేస్తుంటే రాజకీయ కారణాలతో టీడీపీ నాయకులు ముఖం చాటే యడం అత్యంత దుర్మార్గమన్నారు బల్క్ డ్రగ్ పార్క్ తో మత్స్యకారులు జీవనోపాధి స్థానిక ప్రజలు ఆరోగ్యం పర్యా వరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని అగ్రహం వ్యక్తం చేశారు పార్క్ నిర్మాణం వల్ల సమద్రంలో కాలుస్యం పెరిగి మత్స్య సంపద నాశనం అయ్యి వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు మత్స్య కారులను ఉసురు పెట్టిన ఏ ప్రభుత్వాని పుట్ట గతులు ఉండవని తెలిపారు వెంటనే రాజయ్యపేట నుండి పోలీసులను వెనుకకు రప్పించి బల్క్ డ్రగ్ పార్క్ ను రద్దు చేయాలని వెంకన్న డిమాండ్ చేసారు.
 

Post a Comment

Previous Post Next Post