అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు ఆదేశాల మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సువర్ణ ఆధ్వర్యంలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని కొత్తపట్నం కేజీబీవీ లో ఘనంగా వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వృక్షో రక్షిత రక్షితః అనే నినాదంతో మొక్కలు నాటడం ద్వారా ఆరంభమై బాలికలు సాధికారత సాధించే విధంగా అడుగులు వేయాలి అని ఆకాంక్షించారు. బాలికలకు వారికి సంబంధించిన చట్టాలు మరియు వారికి ఉన్న వివిధ పథకాలపై అవగాహన కల్పించారు.
బాలికల అభివృద్ధికి అవరోధాలు మరియు లక్ష్యాలను చేరుకునే మార్గాలు అనే అంశంపై వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించి వారికి ప్రత్యేక బహుమతులు న్యాయ మరియు పరివీక్షణ అధికారి బి రత్న ప్రసాద్ ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మీరున్నిసా బేగం, సైన్స్ ఉపాధ్యాయురాలు కె శ్రీదేవి మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం ఔట్రీచ్ వర్కర్ శామ్యూల్ ఈ కార్యక్రమం లో ముఖ్యపాత్ర వహించారు. సాడ్స్ ఎన్జీవో ప్రతినిధులు స్వప్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Add
.jpg)

