కోర్టు ఉత్తర్వులు ద్ధిక్కరణ - యదేచ్చగా భూకబ్జా.
విలేకరి ముసుగులో పాత డాకుమెంట్స్ లో దిక్కులు, కొలతలు మార్పు.
ఓ చోట స్థలం - మరో చోట కోలతలు మార్చి అమ్మకం.
1940,1950 రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ నే మార్చిన వైనం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి-దాసరి యోబు
కంభం : కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన స్థలానికి ఆ కోర్టు ఉత్తర్వలు మాకు వర్తించవు అంటూ ఆ కోర్టు ఉత్తర్వులనే ద్ధిక్కరణ చేస్తూ యదేచ్చగా భూ కబ్జా చేస్తున్నారు. పాత డాకుమెంట్స్ లో దిక్కులు, కొలతలు మార్చి యదేచ్చగా భూ కబ్జా చేస్తున్నారు.ఓ యూట్యూబ్ ఛానెల్ లో విలేకరి అంటూ ఆ ముసుగులో 1950 రిజిస్ట్రేషన్ డాకుమెంట్స్ మార్చి మరి భూ కబ్జా చేసి అమ్మకం చేశాడు.
ఇది జిల్లాలోని కంభం మండలం హజరత్ గూడెం గ్రామ పంచాయితీ లో తంతు..వివరాల్లోకి వెళితే కంభం మండలం హజరత్ గూడెం గ్రామ పంచాయితీ కాగితాలగూడెం ఇలాక లో తన భూమి ఓ చోట ఉంటే వేరే చోట భూమినీ కబ్జా చేసి అమ్మేశాడు ఆ విలేకరి. విలేకరి ముసుగులో యదేచ్చగా దిక్కులు, కొలతలు మార్చాడు. అంతటి తో ఆగక ఆ దిక్కులు కోలతలతో 2022 వ సంవత్సరం లో పంచాయితీ అధికారి వద్ద ధ్రువీకరణ పత్రం తో యదేచ్చగా భూ కబ్జా చేసి అమ్మకం చేశాడు.మార్కాపురం పట్టణమునకు చెందిన షేక్ హుస్సేన్ అలీ యూట్యూబ్ ఛానెల్ లో రిపోర్టర్ అంటూ తన స్టలానికి ఉన్న లింక్ డాకుమెంట్స్ 1940, 1950 డాకుమెంట్స్ లో ఉన్న సరిహద్దుల్లో ఉన్న కొలతలు మార్చి తన పక్క స్థలాన్ని తనదే అంటూ నమ్మబలికి అమ్మకము చేశాడు. అయితే పక్క స్థలంలో ఉన్న షేక్.బాబు స్థలాన్ని పలువురు ఆక్రమించారని తెలిసి గతం లో జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గిద్దలూరులో కేసు వేయగా ఆ స్థలానికి కోర్టు తీర్పు ఇచ్చింది.ఇదంతా తెలిసి కూడా నేను విలేకరిని నన్ను ఏం చేస్తారు లే!... అంటూ ఆ కోర్ట్ ఉత్తర్వులు కూడా భే ఖాతరు చేస్తూ యదేచ్చగా కబ్జా చేసిన స్థలానికి ఫెన్సింగ్ వేసాడు.ఇదే సమస్య పై మరల పలువురు ఆక్రమించేదుకు యత్నిస్తున్నారని, డాకుమెంట్స్ లో కొలతలు, దిక్కులు మార్చి మోసపూరికంగా అమ్మకం చేసి తన స్థలమును కబ్జా చేస్తున్నాడని బాధితులు పోలీసులకు తెలిపారు.కంభం స్టేషన్ లో పోలీసులకు తెలిపినా కానీ పోలీసులు మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని,న్యాయం జరగాల్సిన చోటే ఇలా అన్యాయం జరుగుతుంటే మౌనం గా ఉన్నారని వాపోతున్నారు బాధితులు.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనీ బాదితులు కోరుతున్నారు.
