ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం,
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పేద, మద్య తరగతి కుటుంబాలకు అండగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
ఈరోజు ఒంగోలులో మినీ స్టేడియంలో జరిగిన ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ తో కలిసి లబ్ధిదారులకు మెగా చెక్కు ను అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, హామీలకు కార్యరూపం ఇస్తూ ప్రజలందరికీ అండగా నిలుస్తున్నట్టు తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే నినాదంతో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుచున్నదన్నారు. కార్మిక కుటుంబాలలో మేలు జరగాలని, ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఈ రోజు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 436 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 11,356 మంది లబ్ధిదారులకు 17కోట్ల 3 లక్షల 40 వేల రూపాయలు అందచేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఒంగోలు నియోజక వర్గ పరిధిలో 2,401 మందిని ఎంపిక చేసి వారి ఖాతాల్లో 15 వేల రూపాయల వంతున 3 కోట్ల 60 లక్షల 15 వేలు ఈ రోజు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇదే కార్యక్రమం కింద గత ప్రభుత్వం కొద్ది మందికి మాత్రమే 10 వేల రూపాయలు ఇవ్వగా, నేడు కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 15 వేల రూపాయలు పండుగ వాతావరణంలో ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నేరవేరుస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ సేవలో అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు. సుదీర్గంగా ఆలోచించి తీసుకువచ్చిన పధకమన్నారు. సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత బస్సు పథకం తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల భవిష్యత్ గురించి ఆలోచించి ఆటో డ్రైవర్ల ను ఆర్ధికంగా ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికినీ ఈ పధకాన్ని అమలు చేస్తూ ఈ రోజు ప్రకాశం జిల్లాలో మొత్తం 17కోట్ల 3 లక్షల 40 వేల రూపాయలు 11,356 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తున్నట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
ఒంగోలు శాసన సభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవ పధకం కింద అర్హత కలిగిన ఒక్కొక్క కుటుంబానికి 15 వేల రూపాయలు ఇవ్వడం జరుగుచున్నదన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ప్రభుత్వానికి ఆర్ధిక భారం అవుతున్నప్పకినీ సుమారు 49 వేల 759 కోట్ల రూపాయలు పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో వాటిని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 436 కోట్ల జమ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 11,356 మంది లబ్ధిదారులకు 17కోట్ల 3 లక్షల 40 వేల రూపాయలు, అలాగే ఒంగోలు నియోజక వర్గ పరిధిలో 2,401 మందికి 3 కోట్ల 60 లక్షల 15 వేలు ఈ రోజు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఏదైనా సమస్య వుంటే మా దృష్టికి తీసుకురావాలని అన్నారు.
నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మాట్లాడుతూ, సదా మీ సేవలో అంటూ ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ హామీలకు కట్టుబడి అర్హత కలిగిన ఆటో డ్రైవర్లు అందరికి 15 వేల రూపాయలు ఈ రోజు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు తల్లికి వందనం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి ఇవ్వడం జరుగుచున్నదన్నారు. రైతులు బాగుంటేనే అందరు బాగుంటాం అన్న ఉద్దేశ్యంతో అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఆర్ధిక సహాయం చేయడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజవర్గాల్లో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. అందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2025-26 సంవత్సరానికి గాను ఆటో డ్రైవర్ సేవలో జిల్లా మొత్తం 11,356 మంది లబ్ధిదారులకు 17కోట్ల 3 లక్షల 40 వేల రూపాయలు అందచేయనున్నట్లు తెలిపారు. అందులో ఒంగోలు నియోజక వర్గ పరిధిలో 2,401 మందికి 3 కోట్ల 60 లక్షల 15 వేలు, సంతనూతలపాడు నియోజక వర్గ పరిధిలో 1,454 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 18 లక్షల 10 వేలు, కొండపి నియోజకవర్గ పరిధిలో 1,161 మందికి 1 కోటి 74 లక్షల 15 వేలు, దర్శి నియోజకవర్గం పరిధిలో 1,089 మంది లబ్ధిదారులకు 1 కోటి 63 లక్షల 35 వేలు, కనిగిరి నియోజకవర్గం పరిధిలో 1,136 మంది లబ్ధిదారులకు 1 కోటి 70 లక్షల 40 వేల రూపాయలు, మార్కాపురం నియోజకవర్గం పరిధిలో 1,831 మంది లబ్ధిదారులకు 2 కోట్ల 74 లక్షల 65 వేలు, గిద్దలూరు నియోజకవర్గం పరిధిలో 1,211 మంది లబ్ధిదారులకు 1కోటి 81 లక్షల 65వేలు, ఎర్రగొండపాలెం నియోజక వర్గంలో 1,073 మంది లబ్ధిదారులకు 1కోటి 60 లక్షల 95 వేల రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హత ఉండి ఎవరికైనా ఈ పధకం కింద ఆర్ధిక సహాయం అందకుండా ఉంటె సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణీకుల శ్రేయస్సు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలు లేని సురక్ష ప్రయాణాలతో ప్రభుత్వ నిబంధనలు నడుచుకోవాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, డ్రైవర్లకు సూచనా చేసారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ శ్రీ ఎస్. వెంకట్రావు, డిటిసి శ్రీమతి సుశీల, ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
