ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం.


 ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం.

 ప్రకాశం జిల్లాక్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా మార్కాపురం లో ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్,ఆర్టీవో సిరి చందన , మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, మరియు జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ బీజేపీ నేతలు.

ఆటో డ్రైవర్ల కుటుంబాల శ్రేయస్సు కొరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 వేల రూపాయలు జమ చేయనున్న సీఎం చంద్రబాబు.

ఈ నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మార్కెట్ యాడ్ వరకు ర్యాలీ నిర్వహించిన ఆటో యజమానులు,డ్రైవర్లు...

ఈ ర్యాలీ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివినాగ్.

ఈ ర్యాలీలో ఆటో డ్రైవర్లతోపాటు ఆటో నడిపిన ఎమ్మెల్యే కందుల, జనసేన ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఆటో యజమానులు, డ్రైవర్లు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post