ఆటో డ్రైవర్ల సేవలో..ఆటో డ్రైవర్ గా దామచర్ల.


ఆటో డ్రైవర్ల సేవలో..ఆటో డ్రైవర్ గా దామచర్ల. 

ప్రకాశంజిల్లా ఒంగోలుశాసనసభ్యులు దామచర్లజనార్ధనరావు ఒక్కసారిగా ఆటో డ్రైవరుగా మారారు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఆటో డ్రైవర్ల సేవలో ' పథకములో భాగంగా శనివారం ఒంగోలు నగరంలోని మినీ స్టేడియంలో జరిగే ప్రధాన కార్యక్రమంలోపాల్గొనేందుకు తమ వాహనాలతో సహా ఆటో డ్రైవర్లు స్థానిక బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లారు. జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి.ఆనంరామనారాయణరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీని ప్రారంభించారు. అక్కడకు వచ్చిన వీరికి ఆటో డ్రైవర్లు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కల్పిస్తున్న ఆర్థిక ప్రయోజనంపై సంతోషం వ్యక్తం చేశారు. దీనితో ప్రజా ప్రతినిధులు అందరూ ఖాకీ చొక్కాలు వేసుకొని ఆటో ఎక్కారు. ఇంతలో ఒక్కసారిగా దామచర్ల జనార్ధన్ డ్రైవర్ సీట్ లో కూర్చున్నారు. నేరుగా ఆయనే ఆటో నడుపుకుంటూ మినీ స్టేడియం వరకు ర్యాలీకి నేతృత్వం వహించారు. శాసనసభ్యులు నడుపుతున్న ఆటోలో మంత్రి, ఎంపీ, మేయర్ కూర్చుని ఈ ర్యాలీకి మరింత శోభ తెచ్చారు. బస్టాండు సెంటర్ నుంచి ట్రంకు రోడ్డు మీదుగా కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ సెంటర్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో సుమారు 500 ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్. గోపాలకృష్ణ, టిటిసి సుశీల, ఒంగోలు ఆర్డిఓ కళావతి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Post a Comment

Previous Post Next Post