కంభం పట్టణంలో గంజాయి పైఎక్సైజ్ శాఖ దాడులు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో గంజాయి దందాపై సమాచారం మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బందితో కలిసి ఈరోజు కంభం గ్రామంలోని అర్బన్ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను మరియు ఒక టీ షాపును పరిశీలించారు. అయితే అక్కడ గంజాయి లేదా ఇతర నిషేధిత పదార్థాలు ఏవీ లభ్యం కాలేదు.
తదనంతరం అర్బన్ కాలనీ నివాసితులకు గంజాయి సేవించడం వలన కలిగే అనర్థాలు, అలాగే దాని విక్రయం మరియు వినియోగం చట్టరీత్యా నేరమని తెలియజేస్తూ జాగృతి కార్యక్రమం చేపట్టారు.
ప్రజలు తమ ప్రాంతంలో ఎవరైనా గంజాయి అమ్మడం గాని సేవించడం గాని గమనించిన పక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు సమాచారం అందించవలసిందిగా సూచించారు.
అనంతరం రైల్వే స్టేషన్ మరియు నక్కలగండి ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టగా, గంజాయి సేవించే వ్యక్తులు ఎవరూ గుర్తించబడలేదు.
Add


