మాతృ మరణాలపై సమీక్ష సమావేశం జిల్లా వైద్య అధికారి.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖఅధికారి ఛాంబర్ నందు డాక్టర్ టి.వెంకటేశ్వర్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖఅధికారి మాతృమరణముల సబ్ కమిటీ ద్వారా మాతృమరణములపై సమీక్షా సమావేశము నిర్వహించినారు, ఈ సమావేశములో జిల్లాలో మాతృమరణములు జరగకుండా చూడాలని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రముల వైద్య సిబ్బందిని ఆదేశించినారు సకాలంలో ప్రమాద సంకేతములుగల గర్భిణీ స్త్రీ లను నమోదు చేసి వారికీ అందించు సేవలను సకాలములో అందించవలయును అన్ని వివరములను ఆర్.సి.హెచ్. యాప్ నందు మరియు యమ్ సి పి కార్డ్ నందు నమోదు చేయలని ఆదేశించారు.
ప్రమాద సంకేతము గల గర్భిణీలను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారి బర్త్ ప్లాన్ ను తయారు చేయవలెను.
ప్రోటోకాల్ ప్రకారము వారికీ అందించు సేవలను వైద్యాధికారి మరియు సుపర్ వైజర్ పరివేక్షణలో అందించవలయును.
ప్రమాదసంకేతములుగల గర్భిణీస్త్రీలను ఆషా మరియు ఎ.యన్.యమ్. సమీపములో ఏరియా ఆసుపత్రికి గాని సర్వజన ఆసుపత్రికిగాని లేదా ఎం.సి.హెచ్ ఆసుపత్రికి గాని సకాలములో 108 వాహనము ద్వారా తరలించవలెను.
ఆసుపత్రిలో సంబంధిత గర్భకోశ నిపుణలద్వారా గర్భిణీ స్త్రీ కి అవసరమైన అన్ని వైద్య సేవలు అందించు విధముగా చూడవలయును.
అందరు గర్భిణీ స్త్రీ లను ప్రతి నెల 10 వ తారీకు జరుగు ప్రధానమంత్రి మాతృ వందన యువజన కార్యక్రమునకు తీసుకొని వచ్చి వారికీ అక్కడ అవసరమైన అన్ని వైద్య పరీక్షలు మరియు స్కాన్ చేయించి వివరములను గర్భిణీ స్త్రీ కి వారి కుటుంబ సభ్యులకు తెలియపరచి మరియు ఎం.సి.పి కార్డు నందు నమోదు చేయవలెను.
ప్రతి గర్భిణీస్త్రీ ఇ.సి.జి పరీక్షలు ఖచ్చితముగా ఎఫ్.డి.పి. కార్యక్రము ద్వారా మరియు 108 వాహనము నందు చేసుకొనవలెనని అదేవిధముగా స్కానింగ్ టిఫా స్కానింగ్ పరీక్షలు చేసుకొనవలెనని తెలిపినారు ఆషా ఎవరు అయినను గర్భిణీస్త్రీలను ప్రవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మాదృష్టికి వచ్చినట్లు అయితే వారిపై తగు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రి రెఫర్ చేయు గర్భిణీస్త్రీలకు ప్రాథమిక స్థాయిలో ఐరన్ లోపములేకుండా తగిన పోష్టిక ఆహారము అందించినట్లు అయితే మాతృమరణములను నివారించవచ్చునని మరియు ప్రతినెలా ఆసుపత్రిలో తగిన పరీక్షలు చేసుకొనవలెనని తెలియజేశారు.
ఆషా కార్యకర్తలు గర్భిణీస్త్రీలకు సమీపములో ఏరియా ఆసుపత్రికి గాని సర్వజన ఆసుపత్రికిగాని లేదా ఎం.సి.హెచ్ ఆసుపత్రికిగాని తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలపై గర్భిణీస్త్రీలకు వారి కుటుంబ సభ్యులకు అవగాహనా కల్పించాలన్నారు.
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖఅధికారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రవేట్ అంబులెన్స్ లు విధిగా డ్రైవర్ తోపాటు మరిఒక్క టెక్నీషియన్ ను నియమించడం ద్వారా అంబులెన్స్ ప్రయాణించు రోగియొక్క వైటల్ వివరములను నమోదు చేయడం సులభమవుతుందని త్వద్వారా రోగికి తదుపరి వైద్య సేవలు అందించడంసులభమవుతుందన్నారు.
ఐ.యమ్.ఎ కార్యదర్శి జాలాది మణిబాబు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రవేట్ అంబులెన్స్ ల పనితీరునుపరిశీలించడంజరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రములో డాక్టర్ మణిబాబు . ఐ.యమ్.ఏ. ప్రతినిది డాక్టర్ కమల ఫాగ్సే ప్రతినిధి . డాక్టర్ కమలశ్రీ . డాక్టర్ కాశీ చైతన్య. సిడిపిఓ యమ్.కె.వరమ్మ మాస్ మీడియా అధికారి దాసరి శ్రీనివాసులు. శ్రీదేవి హెల్త్ ఎడ్యుకేటర్ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు.
Add
.jpg)
